Teluguwonders:
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ విలన్ గా నటించిన వాల్మీకి సినిమా పేరును కోర్టు ఆదేశాల మేరకు గద్దలకొండ గణేష్ గా మార్చేశారు ఈ విషయాన్ని దర్శకుడు హరీష్ శంకర్ గురువారం రాత్రి కన్ఫర్మ్ చేశాడు. ఈ రోజు రిలీజ్ అయిన గద్దలకొండ గణేష్(వాల్మీకి) సినిమాకి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుంది.చాలా రోజుల తరువాత హరీష్ శంకర్ కి మంచి హిట్ వచ్చింది అని అంటున్నారు.వరుణ్ తేజ్ నటనపై ప్రశంసలు జల్లు కురుస్తుంది .
ఈ సినిమాలో దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన” దేవత” సినిమాలోని వెల్లువచ్చి గోదారమ్మ పాట ను రీమేక్ చేసిన విషయం తెలిసిందే. శోభన్ బాబు మరియు శ్రీదేవి లపై షూట్ చేసిన ఈ పాట ఆల్ టైమ్ క్లాసిక్స్ లో ఒకటి.ఈ పాటకు హరీష్ శంకర్ న్యాయం చేస్తాడా అనే అనుమానం అందరిలో ఉండేది.
కానీ ఆ అనుమానాన్ని పటాపంచలు చేస్తూ ఈ పాటను హరీష్ శంకర్ చాలా బాగా చిత్రికరించాడు.
ఈ పాటలోని ప్రతి ఫ్రేమ్ చాలా అందంగా ఉంది. వరుణ్ తేజ్ ఉంగరాల జుట్టు, కొంటె చూపులు , పూజా హెగ్డే డ్యాన్స్ ఈ పాటకు మరింత అందాన్ని తీసుకవచ్చాయి . సినిమాలో ఈ పాట వచ్చే ఐదు నిమిషాలు ప్రేక్షకులు రొమాంటిక్ మూడ్ లోకి వెళ్లతారు .ఈ పాటలో వరుణ్ తేజ్ రొమాంటిక్ ఎక్స్ ప్రేషన్స్ 80 వ దశకం చిరంజీవి ని గుర్తుకు తెస్తాయి .ఈ పాటలో కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయి. శేఖర్ మాస్టర్ ఈ పాటకు సింపుల్ బట్ మార్వలెస్ కొరియోగ్రాఫ్ చేశాడు.వెల్లువచ్చి గోదారమ్మ పాట చాలా బాగుందని ప్రేక్షకులు అంటున్నారు. మొత్తానికి క్లాసిక్ పాటను ను రీమేక్ చేయడంలో హరీష శంకర్ సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.