పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్న అంటున్న డైరెక్టర్ హరీష్ శంకర్..!

Pawan Kalyan and director Harish Shankar
Spread the love

Teluguwonders:

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి డైరెక్టర్ హరీష్ శంకర్ వీరాభిమాని అని అందరికీ తెలుసు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది. ఖుషి తర్వాత ఎటువంటి అంటే పవర్ స్టార్ కి తగ్గ రేంజ్ లో ఒక్క హిట్టు కూడా లేదు. అయితే పవన్ కళ్యాణ్ కి అభిమాని అయిన డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమా పవన్ కళ్యాణ్ కి మర్చిపోలేని హిట్ ఇవ్వటం జరిగింది. అయితే తాజాగా హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన వరుణ్ తేజ్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో గబ్బర్ సింగ్ సినిమా తీసిన సందర్భంలో జరిగిన ఓ సన్నివేశం గురించి బయటపెట్టారు. విషయంలోకి వెళితే గతంలో పవన్ కళ్యాణ్ నటించిన బద్రి, తమ్ముడు వంటి సినిమాల్లో పవన్ కళ్యాణ్ అదిరిపోయే స్టెప్పులు వేయడం జరిగింది.

కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలలో పవన్ కళ్యాణ్ పెద్దగా డాన్స్ చేసిన సందర్భాలు లేవు. సాంగ్ అంటే సైలెంట్ గా అటు ఇటు నడుస్తూ సింపుల్ మేనరిజమ్స్ చేస్తూ మేనేజ్ చేసేవాడు. కానీ పవన్ అభిమానులు మాత్రం అతడు ఎప్పుడు డాన్స్ చేస్తాడా అని ఎదురుచూసేవారు. ఇటువంటి క్రమంలో గబ్బర్ సింగ్ సినిమా చేస్తున్న సందర్భంలో ‘పిల్లా నువ్వు లేని జీవితం’ పాట షూటింగ్ స్విట్జర్లాండ్ లో జరుగుతున్న సమయంలో పవన్ కి విపరీతమైన బ్యాక్ పెయిన్ వచ్చిందట. ఇక తన వల్ల కాదని హైదరాబాద్ వెళ్లి బ్యాలన్స్ ఉన్నది పూర్తి చేద్దామని పవన్ చెప్పారట.

అయినప్పటికీ హరీష్ శంకర్ ఆయన్ని విడిచి పెట్టలేదట. ”మీ డాన్స్ చూడాలని ఆడియన్స్ చచ్చిపోతున్నారు, చాలారోజుల నుంచి మీరు డాన్స్ చేయడంలేదు. స్టార్టింగ్ లో డాన్స్ రుచిచూపించి ఆపేశారు. మళ్లీ అలాంటి స్టెప్పులేయాల్సిందే. పైగా ఈ పాటకు స్టెప్పులు అవసరం. స్టెప్పులేయండి ప్లీజ్” అంటూ పవన్ కాళ్ల మీద చేతులు వేసినట్లు హరీష్ శంకర్ చెప్పారు. వెంటనే పవన్ కళ్యాణ్ నువ్వు డైరెక్టర్ అయ్యుండి కాళ్ళ మీద పడటం మంచిది కాదు అని చెప్పి స్టెప్పులు అదిరిపోయే రీతిలో పవన్ కళ్యాణ్ వేశారని హరీష్ శంకర్ చెప్పుకొచ్చారు.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading