‘వరుడు కావలెను’ ప్రమోషన్స్ వేరే లెవల్..!
హైదరాబాద్: నగరంలో జరిగిన పలు పెళ్లి వేడుకల్లో నటుడు నాగశౌర్య, నటి రీతూవర్మ కలిసి సందడి చేశారు. వధూవరులకు శుభాకాంక్షలు చెప్పి.. తమ చిత్రాన్ని ప్రమోట్ చేసుకున్నారు. వీళ్లిద్దరూ జంటగా నటించిన యూత్‌ఫుల్ లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘వరుడు కావలెను’. లక్ష్మి సౌభాగ్య దర్శకత్వం వహించిన ఈ ఫీల్‌గుడ్ చిత్రం అక్టోబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘వరుడు కావలెను’ వెరైటీ ప్రమోషన్స్‌కు తెరతీసింది. ఇప్పటికే ‘వరుడు కావలెను సంగీత్ సెలబ్రేషన్స్’తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న…