Mystery Goddess: ఈ ఆలయం సైన్స్ కి సవాల్.. అగ్నితో స్నానం చేసే అమ్మవారు.. దర్శించుకుంటే వ్యాధులు నయం అనే నమ్మకం

మన దేశంలో ఎన్నో అత్యంత పురాతన ఆలయాలున్నాయి. వాటిల్లో ఎన్నో ఆలయాలు నేటికీ మానవ మేథస్సుకి అందని రహస్యాలను దాచుకున్నాయి. సైన్స్ చేధించని రహస్యంతో భక్తులను అమితంగా ఆకర్షించే అమ్మవారి ఆలయాల్లో 1000 సంవత్సరాలకు పైగా పురాతనమైన ఇడాన మాత ఆలయం ఒకటి. ఇది రాజస్థాన్‌లోని ఒక మర్మమైన, పవిత్రమైన ఆలయం. ఇక్కడ దేవత అగ్నితో స్నానం చేస్తుందని నమ్మకం.
రాజస్థాన్‌లోని ఉదయపూర్ సమీపంలోని ఇడాన మాత ఈ ఆలయం దుర్గాదేవి అవతారంగా పరిగణించబడుతుంది. 1000 సంవత్సరాలకు పైగా పురాతనమైన ఈ ఆలయంలో అమ్మవారు స్వయంభువుగా దుష్టులను శిక్షించడానికి వేలిసిందని నమ్మకం. ఈ ఆలయంలో దేవత అగ్ని స్నానం చేస్తుంది. ఇది నేటికీ సైన్స్ కి ఒక సవాల్ గా ఉంది. ఈ అద్భుతంతోనే భారతదేశంలోని శక్తి పీఠాలలో ప్రత్యేకమైదిగా నిలిచింది. దేవత అగ్ని స్నానం చేస్తున్న సమయంలో అమ్మవారిని సందర్శించే భక్తుల దుఃఖాలు తొలగి.. అనారోగ్యాల నుంచి ఉపశమనం పొందుతారని నమ్మకం.
ఆలయ రహస్యం. రాజస్థాన్‌లోని ఉదయపూర్ నుంచి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆరావళి కొండలలో ఇడాన మాత ఆలయం ఉంది. ఇది సాధారణ ఆలయం కాదు.. మేవార్ శక్తి పీఠంగా పరిగణించబడుతుంది. దీని అత్యంత ముఖ్యమైన లక్షణం ఏమిటంటే ఆలయానికి పైకప్పు లేదు. దేవత స్వయంగా ఇక్కడ అగ్నిలో స్నానం చేస్తుంది.
అగ్ని స్నానం అద్భుత దృగ్విషయం అప్పుడప్పుడు ఆలయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగుతాయని చెబుతారు. మంటలు 10 నుంచి 20 అడుగుల వరకు ఎగసిపడతాయి. అప్పుడు దేవత మీద ఉండే చున్నీ, అలంకరణ వస్తువులు, దండలు, ఇతర నైవేద్యాలు అగ్నికి దహనం అయి బూడిదగా మారుతాయి. అయితే దేవత విగ్రహానికి ఎటువంటి మరక మసి కూడా అంటకుండా.. అలాగే ఉంటుంది. భక్తులు ఈ దృగ్విషయాన్ని అమ్మవారి అగ్ని స్నానంగా పిలుస్తారు.
అగ్ని స్నానం ఎందుకు చేస్తుందంటే స్థానిక నమ్మకం ప్రకారం అమ్మవారి శక్తి మేల్కొన్నప్పుడు అగ్ని ఆకస్మికంగా కనిపిస్తుంది. దీనిని దేవత స్వీయ-శుద్ధి రూపంగా కూడా పరిగణిస్తారు. అందుకే ఆలయ ప్రాంగణంలో అగరుబత్తులు లేదా ఇతర మండే పదార్థాలను ఎప్పుడూ వెలిగించండి. ఎందుకంటే అగ్ని.. దేవత సంకల్పం ద్వారా మాత్రమే ఉత్పత్తి అవుతుందని నమ్ముతారు.
సంప్రదాయాలు- ఆచారాలు ఆలయంలో అగ్ని ఉద్భవించినప్పుడు.. ఆలయ పూజారులు ముందుగా అమ్మవారి ఆభరణాలను తొలగిస్తారు. అగ్ని ఆరిన తర్వాత.. విగ్రహాన్ని తిరిగి అలంకరిస్తారు. ఈ అగ్ని స్నానాన్ని చూడటం వల్ల జీవితంలోని అన్ని దుఃఖాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు.
వ్యాధి, బాధలను తొలగిస్తుందని నమ్మకం. ఇడాన మాతను వ్యాధులను నయం చేసే దేవతగా కూడా భావిస్తారు. పక్షవాతం ఉన్నవారు ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే నయమవుతుందని చెబుతారు. భక్తులు తమ కోరికలు నెరవేరిన తర్వాత త్రిశూలాన్ని సమర్పిస్తారు. దూర ప్రాంతాల నుంచి భక్తులు ఈ అద్భుత ఆలయాన్ని సందర్శిస్తారు.
చరిత్ర- ప్రాముఖ్యత ఈ ఆలయం పాండవుల కాలం నాటిదని చరిత్రకారులు భావిస్తున్నారు. జై సింగ్ రాజు కూడా ఈ దేవతను పూజించేవాడు. అందుకే ఇడాన మాత ఆలయం విశ్వాసానికి చిహ్నంగా మాత్రమే కాకుండా చరిత్ర, సంప్రదాయానికి సాక్ష్యంగా కూడా ఉంది.
ఊహించని సమయంలో జరిగే అద్భుతాలు అగ్ని స్నాన సమయం ఇది అని ఎవరూ చెప్పలేరు. కొన్నిసార్లు ఇలా నెలకు రెండు లేదా మూడు సార్లు జరుగుతుంది. కొన్నిసార్లు సంవత్సరంలో కొన్ని సార్లు మాత్రమే జరుగుతుంది. అయితే అగ్ని స్నానం ఎప్పుడు చేసినా ఫలితం ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. దేవత విగ్రహాన్ని అగ్ని ఏమీ చేయదు. ఈ ఆలయం గురించి వెలుగులోకి వచ్చిన తర్వత భక్తుల విశ్వాసం మరింత పెరుగుతూ వస్తోంది.
ఈ ఆలయం ఎందుకు ప్రత్యేకమైనది? నేటికీ ఈ ప్రదేశం భారతదేశంలోని అరుదైన అద్భుతాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. అగ్ని స్నానం సమయంలో దేవత తమ పాపాలను, బాధలను దహిస్తుందని భక్తులు నమ్ముతారు. అందుకే ఇడాన మాత ఆలయం విశ్వాసం, రహస్యం రెండింటి ప్రత్యేకమైన సమ్మేళనం.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
