ఎక్కువ పెన్షన్ తీసుకోవాలని అనుకుంటున్నార..

National Pension System

Teluguwonders:

💥రిటైర్మెంట్ తర్వాత :

ఎక్కువ పెన్షన్ తీసుకోవాలని అనుకుంటే మీరు ఇప్పటి నుంచే తగిన ప్రణాళికలతో ముందుకు వెళ్లాలి. అప్పుడు పదవీ విరమణ తర్వాత ఆశించిన పెన్షన్ పొందొచ్చు. దీని కోసం అందుబాటులో మూడు పథకాలు ఉన్నాయి.

రిటైర్మెంట్‌కు ముందుగానే ప్లాన్ చేసుకోవాలి.అందుబాటులో మూడు గవర్నమెంట్ స్కీమ్స్
ఎన్‌పీఎస్, ఏపీవై, పీఎంఎస్‌వైఎం అనేవి ఇవి.రెండు స్కీమ్స్ అసంఘటిత కార్మికుల కోసం.. ఒకటేమో వేతన జీవుల కోసం.

రిటైర్మెంట్‌ను కరెక్ట్‌గా ప్లాన్ చేసుకోవాలి. డబ్బు సంపాదిస్తున్నవారు పదవీ విరమణ తర్వాత సుఖవంతమైన జీవనం గడిపేందుకు ఇప్పటి నుంచే తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలి. ఇందుకు ప్రధానంగా 3 ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ పెన్షన్ స్కీమ్ (PMSYM), నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS), అటల్ పెన్షన్ యోజన (APY) అనేవి ఇవి.

🔴పీఎంఎస్‌వైఎం :

అసంఘటిత రంగంలోని పనిచేసే 18 నుంచి 40 ఏళ్లలోపు వయసు ఉన్నవారు ఎవరైనాసరే ఈ Pradhan Mantri Shram Yogi Maandhan pension scheme స్కీమ్‌లో చేరొచ్చు. ఇతర గవర్నమెంట్ పెన్షన్ స్కీమ్స్‌లో లేనివారు ఈ స్కీమ్‌ కోసం నమోదు చేసుకోవచ్చు. నిర్మాణ కూలీలు, చెత్త సేకరించేవారు, డ్రైవర్లు వంటి వివిధ రకాల పనులు చేసేవారు స్కీమ్‌కు అర్హులు.
నెలకు రూ.3,000 పెన్షన్ తీసుకోవచ్చు. మీరు చెల్లించే మొత్తానికి సమాన మొత్తంలో ప్రభుత్వం కూడా మీ పెన్షన్ అకౌంట్‌కు జమాచేస్తుంది. బ్యాంక్ అకౌంట్, ఆధార్ ఉంటే సరిపోతుంది. 18 ఏళ్లకే స్కీమ్‌లో చేరితే నెలకు రూ.55 కట్టాలి. 40 ఏళ్లలో స్కీమ్‌లో చేరితే నెలకు రూ.200 చెల్లించాలి. 60 ఏళ్ల తర్వాత పెన్షన్ వస్తుంది.

🔴అటల్ పెన్షన్ యోజన :

ఈ స్కీమ్ కూడా అసంఘటిత రంగంలోని వారికే వర్తిస్తుంది. నెలకు రూ.1,000 నుంచి రూ.5,000 వరకు పెన్షన్ తీసుకోవచ్చు. పెన్షన్ 60 ఏళ్ల తర్వాతనే వస్తుంది. 18 నుంచి 40 ఏళ్లలోపు వారు ఈ స్కీమ్‌లో చేరొచ్చు. నెలకు కనీసం రూ.42 నుంచి చెల్లించాల్సి ఉంది. వయసు, పెన్షన్ మొత్తం ప్రాతిపదికన నెలవారీ మొత్తం మారుతుంది.

🔴నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్)

National Pension System : ఇది వాలంటరీ రిటైర్మెంట్ సేవింగ్ స్కీమ్. వేతన జీవులు ఎవరైనాసరే ఈ స్కీమ్‌లో చేరొచ్చు. మార్కెట్ పనితీరు ఆధారంగా 60 ఏళ్ల తర్వాత మీరు ఎన్‌పీఎస్ నుంచి పొందే పెన్షన్ ఆధారపడి ఉంటుంది. 8 నుంచి 12 శాతం రాబడిని ఆశించొచ్చు. ఎన్‌పీఎస్ డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనే అంశం పెన్షన్ ఫండ్ మేనేజర్లు చూసుకుంటారు. పీఎఫ్ఆర్‌డీఏ వీరిని నియమిస్తుంది. పలు బ్యాంకుల్లో ఎన్‌పీఎస్ అకౌంట్ ప్రారంభించొచ్చు.

💥ఏపీవై, పీఎంఎస్‌వైఎం స్కీమ్స్‌లో రిటైర్మెంట్ తర్వాత కచ్చితమైన పింఛన్ తీసుకోవచ్చు. దీనికి ఇప్పటి నుంచే కొంత మొత్తాన్ని ప్రతి నెలా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాలి. ఎన్‌పీఎస్‌లో అంతిమ రాబడి మార్కెట్ పనితీరుపై ఆధారపడి ఉంటుంది. 👉ఏపీవై, పీఎంఎస్‌వైఎం స్కీమ్స్ అసంఘటిత రంగంలో పనిచేసేవారి అవసరాల కోసం ఆవిష్కరించినవి. 👉ఇక ఎన్‌పీఎస్ అనేది వేతన జీవులకు సంబంధించినది.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights