*.. ఒక్క క్లిక్‌తో తెలుసుకోండిలా..!* ఇంటర్ రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల మార్కుల వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.
రీవెరిఫికేషన్ మార్కులు ఇంటర్మీడియట్ మార్కుల రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల మార్కుల వివరాలను వెబ్సైట్లో ఉంచినట్లు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి రామకృష్ణ ఒక ప్రకటనలో వెల్లడించారు.
మార్కుల జాబితాలను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఇంటర్ మార్కుల రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం సుమారు 37వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఫలితాలను https://bie.ap.gov.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.
ఇంటర్ ఫలితాలు విడుదలైన తర్వాత ఫలితాల్లో సందేహాలున్న వాళ్లు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ చేసుకోవచ్చు అని ఇంటర్ బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే https://bie.ap.gov.in/ వెబ్సైట్ ద్వారా సవరించిన మార్కులు, స్కాన్ చేసిన జవాబు పత్రాలు డౌన్లోడ్ చేసుకోవచ్చని కూడా ఇంటర్ బోర్డు తెలిపింది.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.