FAKE: విద్యార్థులందరికి రూ.11 వేలు?
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి విజృంభణతో పాటు సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ కూడా అలానే వ్యాప్తి చేందుతుంది. ఇంటర్నెట్‌లో కనిపించే ప్రతిదీ నిజమని నమ్మితే.. బొక్కబోర్లా పడతాం. ఇలా వైరలయ్యే న్యూస్‌ను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని ఆ తర్వాత నమ్మాలి.
ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇలాంటి ఫేక్ న్యూస్ ఒకటి తెగ వైరలవుతోంది. దాని సారంశం ఏంటంటే.. కేంద్రం విద్యార్థులందరికి 11 వేల రూపాయల స్కాలర్‌షిప్ అందిస్తుంది.
స్కూలు, కాలేజీ స్టూడెంట్స్ ఫీజులు చెల్లించడం కోసం ఈ స్కాలర్‌షిప్‌ను ఇవ్వనుందనే వార్త కొద్ది రోజులుగా తెగ వైరలవుతోంది. అన్‌లాక్ 4.0లో భాగంగా విద్యాసంస్థలు తెరిచారు.
అయితే చాలా మంది విద్యార్థులు ఫీజులు చెల్లించే పరిస్థితిలో లేరు. కనుక తమకు సాయం చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరారు. వారి విన్నపం మేరకు ప్రభుత్వం ప్రతి విద్యార్థికి 11 వేల రూపాయల స్కాలర్‌షిప్ ఇవ్వనుంది అని.
అయితే ఇది ఫేక్ న్యూస్.. కేంద్రం ఇలాంటి ప్రకటన చేయలేదు. ఈ క్రమంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) ఈ ఫేక్ న్యూస్‌ని తొలగించడేమ కాక విద్యార్థులందరికి కేంద్రం 11 వేల రూపాయలు ఇస్తుందంటూ ఓ వెబ్‌సైట్‌లో వచ్చిన ఈ వార్త నిజం కాదు.
ఆ వెబ్‌సైట్ కూడా నిజం కాదు. కేంద్రం ఇలాంటి ప్రకటన చేయలేదు అని ట్వీట్ చేసింది. ఇంటర్నెట్‌లో ప్రచారంలో ఉన్న తప్పుడు సమాచారం, నకిలీ వార్తలను అరికట్టడానికి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో 2019 డిసెంబర్‌లో ఈ ఫ్యాక్ట్ చెక్ ఆర్మ్‌ని ప్రారంభించింది. దీని లక్ష్యం “వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రసారం అవుతున్న ప్రభుత్వ విధానాలు, పథకాలకు సంబంధించిన తప్పుడు సమాచారాన్ని గుర్తించడం.. ప్రజలను హెచ్చరించడం’’.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.