ఈ మహమ్మారి ప్రభావంతో ఆర్థిక వ్యవస్థలు ఏర్పడ్డాయి ఇబ్బందుల వల్ల భారత్లో సుమారు 2.5 కోట్ల ఉద్యోగాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని అంతర్జాతీయ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థ ఆర్థర్ డీ లిటిల్ అంచనా వేసింది. దీంతో 12 కోట్ల మంది మళ్లీ పేదరికంలోని జారుకుంటారని ఆ సంస్థ తెలిపింది. భారత్ లో మహమ్మారి ప్రభావంపై అంతర్జాతీయ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థ ఆర్థర్ డి.లిటిల్ అంచనా వేసి ఓ నివేదికను రూపొందించింది. భారత్- ఈ వైరస్ కారణంగా ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను అధిగమించడం: ఈ వైరస్ ప్రభావం అనంతరం ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరణ బలోపేతం చేయడానికి 10 పాయింట్ల కార్యక్రమం’పేరుతో ఈ నివేదిక రూపొందించిన ఆర్డర్ డి. లిటిట్.. అనేక అంశాలను ప్రస్తావించింది.
దీని ప్రభావం కారణంగా మొత్తం 13.5 కోట్ల మంది ఉపాధి కోల్పోవడంతో వినియోగదారుల ఆదాయంపై ప్రభావం చూపుతుంది.. దీని వల్ల వ్యయాలు పొదుపు తగ్గిపోతాయని నివేదిక తెలిపింది. అంతేకాదు తలసరి ఆదాయం క్షీణించడంతోపాటు జీడీపీ కూడా పడిపోతుందని వ్యాఖ్యానించింది. క్రమంగా భారత్లో పెరుగుతున్న మహమ్మారి పాజిటివ్ కేసులు చూస్తోంటే రికవరీ డబ్ల్యూ ఆకారంలో వచ్చే అవకాశం ఉంది.
అంచనా వేసిన జీడీపీ మందగమనం తాలూకూ నష్టంతో ఉద్యోగాలు పేదరిక నిర్మూలన తలసరి ఆదాయం నామమాత్రపు జీడీపీలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది అని ప్రస్తుతం 7.6 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు 35 శాతానికి చేరొచ్చు అని దీనితో 13.6 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోవడమే కాకుండా మొత్తం 17.4 కోట్ల మంది నిరుద్యోగులు తయారవుతారు. ఈ ప్రభావంతో 12 కోట్ల మంది పేదరికంలోకి జారుకుంటారు. అందులో 4 కోట్ల మంది నిరు పేదలుగా మారతారని నివేదిక ద్వారా తెలిపారు. కాగా దేశంలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 96 వేలు దాటిపోగా …మరణాల సంఖ్య 3 వేలు దాటి పోయింది.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.