AP 24X7 చానల్ కి కొత్త సీఈవో

Spread the love

ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో విజయవాడ కేంద్రంగా AP 24X7 అనే చానల్ ప్రారంభమయింది.

మా టీవీ మాజీ అధినేత మురళీకృష్ణంరాజు ఈ చానల్‌కు చైర్మన్.

మరికొంత మంది పెట్టుబడిదారులతో కలిసి ప్రారంభమైన ఈ చానల్ మొదట్లో బాగానే నడిచింది. అయితే అక్కడ పని చేస్తున్న ఉద్యోగుల మధ్య ఆధిపత్య పోరు తెరపైకి వచ్చింది. సీనియర్ జర్నలిస్ట్ లు వెంకటకృష్ణ , సాయి ఛానల్ ని చూసేవారు. కొద్దిరోజులకే ఆధిపత్య పోరుతో సాయి బయటికి వెళ్లిపోయారు.

తర్వాత సీఈవోగా వెంకటకృష్ణ కొన్నాళ్లు కొనసాగారు. అయితే వెంకటకృష్ణ తెలుగుదేశం స్టాండ్ తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఆయన పెట్టె చర్చలు చాలా వరకు తెలుగుదేశాన్ని సమర్ధిస్తున్నట్లు ఉండేవని విమర్శలు వచ్చాయి.

ఒక దశలో ఆయన చంద్రబాబు ప్యాకేజీ తీసుకొని చర్చలు పెడుతున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల నడుమ ఆయన సీఈవో పోస్ట్ కి రిజైన్ చేసి బయటికి వచ్చి ఏబీఎన్ లో చేరిపోయారు. ఈ పరిణామాల మధ్య కొన్నాళ్ళు ఇన్ యాక్టివ్ అయిపోయిన AP 24X7 ఛానల్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా సిద్దమౌతుంది.

AP 24X7 చానల్ కొత్త సీఈవో గా సుధాకర్ అడపా బాధ్యతలు తీసుకున్నారు. పలు సాఫ్ట్వేర్ కంపెనీలకు సీఈవోగా పని చేసిన అనుభవం వున్న సుధాకర్ కి అధికార పార్టీ వైసీపీతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తుంది .

ఇప్పుడు ఆయన్ని AP 24X7 ఛానల్ కి సీఈవో చేయడంతో మళ్ళీ ఛానల్ కి కొత్త ఊపిరి వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు.

ప్రస్తుతం చైర్మన్ గా మురళీకృష్ణంరాజే వున్నారు. అయితే కొత్త సీఈవో ఆద్వర్యంలో ఛానల్ ని గ్రౌండ్ లెవల్ నుండి సమూల మార్పులు చేపట్టే దిశగా అడుగులు వేస్తోన్నట్లు తెలుస్తుంది.

ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీపై ఆయన అపారమైన పట్టువుంది. చిన్న వయసులోనే దేశ విదేశాల్లో ఆయన పలు కంపెనీలు నిర్వహించారు. అంతేకాదు సుధాకర్ కి అధికార పార్టీ వైసీపీతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తుంది. అధికార పార్టీ వైసీపీలో ఆయన కీలకంగా వున్నారని సమాచారం. ఇప్పుడు ఆయన AP 24X7 ఛానల్ కి సీఈవో కావడంతో మళ్ళీ ఛానల్ స్వింగ్ లోకి తీసుకురావడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *