అసెంబ్లీలో హీరోయిన్

Spread the love

Teluguwonders: ఏపీ అసెంబ్లీ లో నిన్న ఆ ఇద్దరు నటులనుచూస్తే అది ఒక షూటింగ్ స్పాట్ లా అనిపించింది . ఆ ఇద్దరు నటులు మరెవరో కాదు ఒకరు నందమూరి బాలకృష్ణ అయితే మరొకరు రోజా . వారి

🔴సినీ రంగ విషయానికి వస్తే..: బాలకృష్ణ రోజా కాంబినేషన్ లో అప్పట్లో నాలుగైదు సూపర్ హిట్ లు ఉన్నాయి అయితే ఇదే కాంబోలో నాలుగైదు సినిమాలు యావరేజ్ అయ్యాయి. వాటిలో బొబ్బిలి సింహం, పెద్దన్నయ్య, సూపర్ హిట్ సినిమాలు కాగా భైరవద్వీపం సినిమా ఇండస్ట్రీ రికార్డ్ గా నిలిచింది . వీరిద్దరూ కలిసి మరికొన్ని సినిమాల్లో నటించినా అవి మాత్రం ఎవరేజ్ గా నిలిచాయి .

🔴రాజకీయ రంగానికి వస్తే : వారిద్దరూ కూడా తమ తమ నియోజకవర్గాల్లో రెండోసారి ఎన్నుకోబడ డం విశేషం .

🔸నగరి లో రోజా : రోజా చిత్తూరు జిల్లా నగరి నుంచి పోటీ చేసి రెండోసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు.

🔸హిందూపురం లో నందమూరి బాలయ్య : అనంతపురం జిల్లా హిందూపురం నుంచి నందమూరి బాలయ్య కూడా రెండోసారి గెలిచారు. అయితే అసెంబ్లీ లాబీల్లో ఎదురుపడిన టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలయ్య..ఇద్దరు నేతలు ఒకర్ని ఇంకొకరు బాగున్నారా అంటూ ఆప్యాయంగా చిరు నవ్వుతో పలకరించుకున్నారు.

🔴వివరాల్లోకి వెళ్తే :
ఏపీ అసెంబ్లీ నాలుగో రోజు వాడీవేడిగా సాగుతోంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం జరిగిన చర్చ.. అధికార-ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. వైసీపీ టీడీపీ ఐదేళ్ల పాలనపై విమర్శల వర్షం కురిపిస్తుంటే.. ప్రతిపక్షం కూడా అదే రేంజ్‌లో కౌంటర్లు ఇస్తోంది. అయితే నాలుగో రోజు అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం
అసెంబ్లీ లాబీల్లో సోమవారం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ- వైసీపీ ఎమ్మెల్యే రోజా ఎదురుపడ్డారు. ఇద్దరు నేతలు చిరు నవ్వుతో బాగున్నారా.. అంటూ పరస్పరం పలకరించుకున్నారు. తర్వాత ఇద్దరు అసెంబ్లీలోకి వెళ్లిపోయారు. ఇటు సభ ప్రారంభానికి ముందు లాబీల్లో రోజాతో సెల్ఫీల కోసం వైసీపీ కార్యకర్తలు చుట్టుముట్టారు. కార్యకర్తలు గుంపులుగా దారిలో నిలబడటంతో.. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు సభలోకి వెళ్లడానికి ఇబ్బంది పడి మార్షల్స్ సహాయం తో.. వారు దారి చూపించడంతో ఆయన సభలోకి వెళ్లారు.

🔴ఇదే హైలైట్ :
నాలుగో రోజు వాడీవేడిగా జరుగుతున్న ఏపీ అసెంబ్లీ లాబీల్లో ఎదురుపడిన బాలయ్య-రోజా చక్కగాపలకరించుకోవటం అసెంబ్లీ లో ఒక హైలైట్ గా నిలిచింది.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading