జగన్ సర్కారు మరో కీలక నిర్ణయం.. బందరు పోర్టు నిర్మాణ ఒప్పందం రద్దు

Spread the love

Teluguwonders:

ఎన్నికల ముందు సుదీర్ఘ పాదయాత్ర చేసిన జగన్.. తాము అధికారంలోకి వస్తే బందరు పోర్టు నిర్మాణాన్ని ప్రభుత్వమే చేపడుతుందని ప్రకటించారు. జగన్ సీఎం అయ్యాక బందరు పోర్టును తెలంగాణకు అప్పగించేలా ప్రభుత్వం రహస్య జీవోను జారీ చేసిందని ప్రతిపక్షం ఆరోపించింది. కానీ ఈ ఆరోపణలకు చెక్ పెట్టేలా జగన్ సర్కారు తాజా నిర్ణయం తీసుకుంది.

🔴 బందరు పోర్టు ఒప్పందాన్ని రద్దు చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం :

గత ప్రభుత్వాల హయాంలో తీసుకున్న నిర్ణయాలను సమీక్షిస్తోన్న జగన్ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. బందరు పోర్టు నిర్మాణం కోసం 2010లో నాటి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రద్దు చేసింది.

🔴గతం లో జరిగింది ఇది – బందరు పోర్టు పనుల కోసం 2008 ఏప్రిల్ 23న వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేశారు. కానీ రెండేళ్ల తర్వాత గానీ ఒప్పందం జరగలేదు. 2019 ఫిబ్రవరి 7న బందరు పోర్టు నిర్మాణ పనుల్ని నాటి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. మేకావారిపాలెంలో ఆయన పైలాన్‌ను  విష్కరించారు. 2025 నాటికి రూ.12 వేల కోట్ల వ్యయంతో ఈ ఓడరేవును నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. బందరు పోర్టు పనులకు 2008లో నాటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేశారు. 2010లో ఒప్పందం జరిగింది. ఏళ్లు గడిచినా పనులు ముందుకు కదల్లేదు. ఇప్పటి వరకూ బందరు పోర్టు నిర్మాణ ప్రక్రియ టెండర్లకే పరిమితమైంది.దీంతో ప్రభుత్వం ఒప్పందాన్ని రద్దు చేసింది. పోర్టు పనులను అప్పగించిన నవయుగతో ఒప్పందాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

🔴 కొత్త ఒప్పందం :

పోర్టు నిర్మాణం కోసం కొత్త ఒప్పందం చేసుకోవాలని భావిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలతోనే పోర్టును నిర్మించాలని జగన్ సర్కారు యోచిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలతో కన్సార్టియం ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. దీంతో డెవలపర్‌కు ఇచ్చిన 412.57 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది. విశాఖ పోర్టు ట్రస్ట్ ద్వారా బందరు పోర్టు నిర్మాణం, అభివృద్ధి చేపట్టాలని జగన్ సర్కారు భావిస్తోంది.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading