Teluguwonders:
ఎస్సీ, ఎస్టీలపై అత్యాచార నిరోధక చట్టం, రిజర్వేషన్ల కారణంగానే ఇవాళ సమాజంలో కులతత్వం అనేది సజీవంగా ఉందంటూ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ తాజాగా వ్యాఖ్యలు చేశారు. తరచు వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనం సృష్టించే బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ మరోసారి తన దూకుడు ప్రదర్శించారు. . ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా నియోజకవర్గానికి సురేంద్ర సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.—
🔴నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో:
‘ఇవాళ కులతత్వం అనేది సజీవంగా ఉందంటే అందుకు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్ తరగతుల చట్టమే కారణం. ఈ చట్టం రద్దు చేస్తే అంటరానితనమనేదే ఉండదు. ఎస్సీ, ఎస్టీ చట్టం, రిజర్వేషన్లు కులతత్వాన్ని సజీవం చేస్తున్నాయి’ అని ఓ ప్రకటనలో సురేంద్ర సింగ్ పేర్కొన్నారు.
🔴 గతంలోకూడా ఇదే రీతి లో:
సురేంద్ర సింగ్ గతంలోనూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు, క్రైస్తవుల ఆధిపత్యం ఉన్న ప్రాంతాల్లో భారతీయ సంస్కృతి, సిద్ధాంతాలు ప్రమాదంలో పడుతున్నట్టు గత జూలై 30న ఆయన వ్యాఖ్యానించారు. అంతకుముందు, ఒకరు కంటే ఎక్కువ మంది భార్యలు, ఇబ్బడిముబ్బడిగా పిల్లలున్న ముస్లింలను ‘జంతు ప్రవృత్తి’ కలిగిన వారిగా పేర్కొంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది జూలైలో మరో వివాదాస్పద వ్యాఖ్య చేస్తూ, హిందుత్వం చెక్కుచెదరకుండా ఉండాలంటే ప్రతి హిందూ జంట కనీసం ఐదుగురు పిల్లల్ని కనాలని అన్నారు.
🔴ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ పై అనుచిత వ్యాఖ్యలు:
కాంగ్రెస్ కు ఓ రాజకీయ విధానం అంటూ ఏదీ లేదని, వచ్చే ఏ ఎన్నికల్లోనూ ఆ పార్టీ గెలవబోదని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావలాంటిదని ఎద్దేవా చేశారు. అంతేకాదు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రావణాసురుడైతే, ఆయన సోదరి ప్రియాంకా గాంధీ శూర్పణఖ లాంటి వారని సురేంద్ర సింగ్ విమర్శించారు. రాముడితో యుద్ధం చేయడానికి ముందు రావణుడు తొలుత తన సోదరి శూర్పణఖను పంపాడని… ఇప్పుడు రాహుల్ కూడా మోదీని ఎదుర్కొడానికి శూర్పణఖ లాంటి ప్రియాంకను బరిలో నిలిపారని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టం వివాదం కారణంగా
నే ఇటీవల జరిగిన రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీని కాంగ్రెస్ ఓడించగలిగిందని గతం లో ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ పేర్కొన్నారు.
🔴మాయావతి పై కూడా:
బీఎస్పీ అధినేత్రి మాయావతిని ట్రాన్స్ జెండర్‌గా అభివర్ణిస్తూ తమ ఎమ్మెల్యే సాధనాసింగ్ చేసిన వ్యాఖ్యలను సైతం సురేంద్ర సింగ్ సమర్థించడం విశేషం. ఆత్మగౌరవం లేనివారిని ట్రాన్స్ జెండర్ అంటారని… సమాజ్ వాదీ పార్టీతో జతకట్టడం ద్వారా తనకు ఆత్మగౌరవం లేదని మాయావతి నిరూపించుకున్నారని చెప్పారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.