ఆ ఎంపీ చేసిన పని చూసి అందరూ ఆశ్చర్యపోయారు..

Hindupuram MP Gorantz Madhav
Spread the love

Teluguwonders:

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారశైలి మిగతా రాజకీయ నాయకులకు భిన్నంగా ఉంటుంది. పోలీసు డిపార్ట్‌మెంట్ నుంచి పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. రాజకీయాలతో టీడీపీ నేత జేసీతో ఢీ అంటే ఢీ అన్నట్టుగా వ్యవహరించిన ఈయన.. ఓ సందర్భంలో మీసం మెలేసి మరీ రాజకీయ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఈ వ్యవహారం ముదరడంతో.. అప్పట్లో పోలీసు శాఖ ఆయనకు అండగా నిలిచింది. ఇటీవలే కియా ప్రారంభోత్సవం సమయంలో ఆయన ఆ సంస్థ ప్రతినిధిపై ఆగ్రహం వ్యక్తం చేశారనే వార్తలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యాయి.

🔴తాను ఎంత ఎదిగినా:

తాజాగా ఈ పోలీస్ ఎంపీ మరోసారి వార్తల్లో నిలిచారు. ఖాకీ యూనిఫాంను వదిలి ఖద్దర్‌లోకి మారినప్పటికీ.. డిపార్ట్‌మెంట్ మిత్రులను మాత్రం ఆయన వదులుకోవడం లేదు. గతంలో తనతో కలిసి పనిచేసిన అధికారి ప్రస్తుతం తనకు భద్రత కల్పించడానికి రాగా.. ఆయనతో ఎంపీ వ్యవహరించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది.

👉వివరాల్లోకి వెళ్తే.:

అనంతపురం సమీపంలోని కొడిమి గ్రామ సమీపంలోని జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలో వన మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ గోరంట్ల మాధవ్ చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. దీంతో అనంతపురం రూరల్ సీఐ బందోబస్తు నిర్వహించారు. భారీ సంఖ్యలో జనం హాజరైన ఈ కార్యక్రమంలో సభ నిర్వాహకులు అతిథులను పిలుస్తుంటే.. ఎంపీ మాధవ్ ఒకేసారి ఓరేయ్ మురళీధర్ రెడ్డి ఇలా రా అని గట్టిగా పిలిచారు..దాంతో అందరూ షాక్ అయ్యారు.

👉అసలు విషయం  ఏంటంటే..:

వీరిద్దరూ 11 ఏళ్లుగా మంచి స్నేహితులు. 1998 నుంచి వీరి స్నేహబంధం కొనసాగుతోంది. “నా ఫ్రెండ్ ఒత్తిళ్లకు తలొగ్గకుండా విధులు నిర్వహిస్తాడు, కొద్దిలో పెద్ద ఉద్యోగాలు తప్పిపోయాయి.. అలాంటి అధికారి మన జిల్లాకు లభించడం అదృష్టమని మాధవ్ ప్రశంసించారు. నా ప్రాణమిత్రుడు నాకు బందోబస్తు నిర్వహించడం ఏంటంటూ.. సీఐని తన పక్కనే కూర్చోబెట్టుకొని సభా కార్యక్రమంలో పాల్గొన్నారు.ఆయన వ్యక్తిత్వం చూసి అందరూ ఆశ్చర్య పోతున్నారు.

💥ఎంపీ గోరంట్ల మాధవ్ ఖాకీ నుంచి ఖద్దర్‌కి మారిన తను ఏ మాత్రం మారలేదని నిరూపించుకున్నారు. తన డిపార్ట్‌మెంట్ ఫ్రెండ్‌కి ఆయన ఇస్తోన్న ప్రాధాన్యం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading