వాలంటీర్ల విధి విధానం..ప్రకటించిన జగన్

jagan announcing the volunteer duty policy
Spread the love

Teluguwonders:

సీఎం జగన్‌మోహన్‌రెడ్డి. సచివాలయంలో స్పందన కార్యక్రమంతో పాటు ఇళ్ల స్థలాలు, ఇసుక విధానం, రైతు భరోసా, గ్రామ వాలంటీర్లు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ‘స్పందన’ కార్యక్రమంలో వచ్చే వినతుల్లో 90 శాతం పరిష్కారమవుతున్నాయని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. 👉జులై మొదటి వారంలో కేవలం 34,541 వినతులు మాత్రమే వచ్చాయని.. అదే నెల చివరి నాటికి వాటి సంఖ్య 1,08,997 చేరిందన్నారు. ప్రజా సమస్యలపై స్పందిస్తున్నందునే వినతుల సంఖ్య పెరిగిందని సీఎం చెప్పారు. క్రమం తప్పకుండా కాల్‌ సెంటర్ల ద్వారా ప్రజలకు ఫోన్‌ చేసి వారి అభిప్రాయాలు తీసుకుంటామని.. అధికారులు ఎలా స్పందిస్తున్నారనే దాన్ని తెలుసుకుంటామన్నారు. అసంతృప్తి స్థాయి 1 శాతం కన్నా తక్కువే ఉండాలని జగన్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

💥గ్రామ వాలంటీర్ల వ్యవస్థ విధి విదానాలు :

గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ఆగస్టు 15న విజయవాడ, గుంటూరులలో ప్రారంభిస్తామని చెప్పారు. మండల స్థాయిలో ఎమ్మెల్యేలు, మండలస్థాయి అధికారులు ప్రారంభిస్తారన్నారు. 👉వాలంటీర్ల విధులపై షెడ్యూల్‌ తయారుచేశామని చెప్పారు.

👉ఆగస్టు 16- ఆగస్టు 23 :

వాలంటీర్లు వారికి కేటాయించిన కుటుంబాలను పరిచయం చేసుకుంటారన్నారు. గ్రామవాలంటీర్లు.

👉సెప్టెంబరు 1 – సెప్టెంబరు 10 :

బియ్యం, పింఛన్లు డోర్‌ డెలివరీ చేస్తారని సీఎం తెలిపారు. నాణ్యమైన, ప్యాకింగ్‌ చేసిన బియ్యం పంపిణీని పైలట్‌ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభిస్తున్నామని.. ఆ తర్వాత మిగిలిన జిల్లాల వర్తింపజేస్తామని ఆయన స్పష్టం చేశారు.

👉సెప్టెంబరు 11 – 15 :

పింఛన్లు, రేషన్‌కార్డులు, ఇళ్లస్థలాలు, రైతు భరోసా లబ్ధిదారులను వాలంటీర్ల గుర్తిస్తారన్నారు. కేవలం 40 రోజుల వ్యవధిలో 2.5 లక్షలమంది వాలంటీర్లని నియమించామన్నారు. రాష్ట్రంలో ఇలా గ్రామ వాలంటీర్ల నియామకం ఒక రికార్డు అని సీఎం వ్యాఖ్యానించారు.

🔴అవినీతికి ఆస్కారంలేని ఇసుక విధానం:

ఇసుక కొరత ఎక్కువగా ఉన్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని సీఎం చెప్పారు. అవినీతికి ఆస్కారం లేని ఇసుక విధానాన్ని తీసుకొస్తామన్నారు. ఇప్పుడున్న 65 ఇసుక రీచ్‌ల నుంచి సరిపడా ఇసుక ఇవ్వలేమని.. ప్రస్తుత డిమాండ్‌ మేరకు 200 ఇసుక రీచ్‌లు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. సెప్టెంబర్‌ 5లోపు ప్రతి రీచ్‌లో వేబ్రిడ్జిలు, వీడియో కెమెరాలు ఉండాలన్నారు. పట్టణాల్లోని ముఖ్యమైన ప్రాంతాల్లో డంపింగ్‌ యార్డులు పెట్టాలని సూచించారు. వరదలతో ఇసుక రీచ్‌లు మూతపడ్డాయని.. వరదలు తగ్గగానే మరింత ఇసుక అందుబాటులోకి వస్తుందని కలెక్టర్లు సీఎంకు తెలిపారు.

🔴అక్టోబర్‌ 15న గ్రామ సచివాలయం ద్వారా రైతుభరోసా :

అక్టోబర్‌ 15న రైతు భరోసా పంపిణీ చేస్తామని సీఎం జగన్‌ చెప్పారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించామన్నారు. దేశం మొత్తం ఈ కార్యక్రమం వైపు చూడాలని.. ఎక్కడా పొరపాట్లు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని చెప్పారు. గ్రామ సచివాలయం ద్వారానే కౌలు రైతులకు కార్డులు అందజేస్తామన్నారు. కౌలు రైతులు అందజేసే కార్డులు 11 నెలల కాలానికి వర్తిస్తాయని చెప్పారు. రైతులకు ఎలాంటి నష్టం రాకుండా, భూమిపై తనకున్న హక్కులపై భంగం కలగకుండా కేవలం పంటపై పాత్రమే 11 నెలలపాటు కౌలు రైతుకు హక్కు వస్తుందన్నారు. కౌలు రైతులకు కార్డులు అందగానే వాళ్లు కూడా రైతు భరోసాకు అర్హులవుతారని జగన్‌ స్పష్టం చేశారు. 👉ఈ ఒక్కసారి మాత్రమే ‘రైతు భరోసా’ను రబీకి ఇస్తున్నామని.. వచ్చే ఏడాది నుంచి మేలోనే ఇచ్చి ఖరీఫ్‌లో రైతులకు బాసటగా ఉంటామని సీఎం వివరించారు.

🔴వచ్చే నెలలో జగన్‌ పర్యటన :

రాష్ట్రవ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలను కలుసుకోవటంతో పాటు నేరుగా వారి సమస్యలను తెలుసుకునేందుకు వీలుగా పర్యటనలు చేపట్టాలని సీఎం భావిస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన తేదీలు ఖరారు కానున్నాయి. జగన్‌ అమెరికా పర్యటన అనంతరం సెప్టెంబర్‌ నుంచి జిల్లాల్లో పర్యటించాలని సీఎం జగన్ నిర్ణయించారు. అమెరికా పర్యటన అనంతరం ఈ తేదీలపై స్పష్టత రానుంది .

👉మరోవైపు గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.34 లక్షల ఉద్యోగాలకు సుమారు 22 లక్షల మంది దరఖాస్తు చేశారని.. పరీక్షలు రాసేవారికి ఎలాంటి ఇబ్బందీ రాకుండా చూడాలని సీఎం ఆదేశించారు.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading