స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పలు కీలక ప్రకటనలు చేసిన మోడీ

Modi made several statements during Independence Day celebrations
Spread the love

Teluguwonders:

దేశవ్యాప్తంగా 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తొలుత రాజ్‌ఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. అనంతరం ఎర్రకోట వద్ద త్రివిధ దళాల గౌరవవందనం స్వీకరించారు. పతాక ఆవిష్కరణ అనంతరం ప్రధాని మోడీ మాట్లాడారు.

👉 కీలక ప్రకటనలు చేసిన మోడీ :

ప్రధాని మోడీ ఈ ప్రసంగంలో పలు కీలక ప్రకటనలు చేశారు. జనాభా నియంత్రణకు సరికొత్త పాలసీ తీసుకు వస్తామని ఆయన వెల్లడించారు. ప్రజల ఆకాంక్ష మేరకు ఆర్టికల్ 370ని రద్దు చేశామన్నారు. దీంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ కలను సాకారం చేశామన్నారు. 70 ఏళ్లుగా చేయని వాటిని తాము 70 రోజుల్లో చేసి చూపించామన్నారు. ఈ 70 రోజుల్లో చిన్నారుల భద్రత నుంచి చంద్రయాన్ దాకా, అవినీతిపై పోరు నుంచి ట్రిపుల్ తలాక్ వరకు, కాశ్మీర్ నుంచి రైతుల దాకా ఎన్నో చేశామన్నారు. ప్రజల సమస్యలకు పరిష్కారాలు అన్వేషిస్తున్నామన్నారు.

ఎంతోమంది త్యాగాల ఫలితమే ఈ స్వతంత్ర్యం అన్నారు. శాంతి, సమృద్ధి, భద్రత కోసం స్వాతంత్రం తర్వాత అందరూ కృషి చేశారన్నారు.

💥100 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ :

మోడర్న్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం రూ.100 లక్షల కోట్లను ఇన్వెస్ట్ చేస్తామని వెల్లడించారు. రానున్న అయిదేళ్లలో 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను నిర్మించేందుకు ఇలా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తామని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భారత్ టాప్ 50 దేశాల్లో ఉండేలా సంస్కరణలు చేపడతామన్నారు.

💥 ఆర్థిక వ్యవస్థ ను 5 ట్రిలియన్ డాలర్లకు..చేరేలా :

అయిదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు చేయాలనే లక్ష్యం కొంతమందికి కష్టంగా కనిపించవచ్చునని, కానీ స్వాతంత్రం వచ్చిన ఏడు దశాబ్దాలలో సాధించిన 2 ట్రిలియన్ డాలర్ల పరిమాణంతో పోలిస్తే 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక అయిదేళ్ల కాలంలో 1 ట్రిలియన్ డాలర్లను ఆర్థిక వ్యవస్థకు జోడించిందని మోడీ చెప్పారు. వచ్చే అయిదేళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిర్మించడం అసాధ్యమేమీ కాదన్నారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవచ్చునని చెప్పారు.

🔴వైద్య రంగంలో కొత్త మార్పులు ;

వైద్య రంగంలోను కొత్త సంస్కరణలు తీసుకు వచ్చామని మోడీ చెప్పారు. ఆయుష్మాన్ భారత్ దేశ ప్రజలకు ఓ వరం అన్నారు. వైద్యాన్ని ప్రతి సామాన్యుడికి అందుబాటులోకి తేవాలన్నదే తమ లక్ష్యం అన్నారు. 👉రైతులకు పింఛన్లు అందిస్తున్నామన్నారు. అయిదేళ్లలో మెరుగైన భారత్‌ను నిర్మించేందుకు కృషి చేస్తున్నామన్నారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనే నినాదంతో ముందుకు సాగుతున్నామన్నారు.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading