Teluguwonders:
పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ ప్రక్రియ నేడు ప్రారంభం కానుంది. గత కాంట్రాక్టర్ నవయుగ ఇంజనీరింగ్ సంస్ధకు కూడా బిడ్డింగ్ లో పాల్గొనే అవకాశం ఇస్తాం. ఇంకా ప్రాజెక్టు పూర్తి చేయడానికి రూ.39 వేల కోట్లు అవసరం. జూన్, 2021 నాటికి ప్రాజక్టు పూర్తి చేసి గ్రావిటీ ద్వారా నీళ్లి అందిస్తాం అని
— ఏపీ జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు. ఏపీలో కీలక ప్రాజెక్టుల్లో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని అనుమానిస్తున్న జగన్ ప్రభుత్వం.. రివర్స్ టెండరింగ్ ప్రక్రియను ప్రారంభిస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా చేపడుతున్న ఈ ప్రక్రియ వల్ల ప్రాజెక్టుల నిర్మాణం మరింత ఆవుతుందని, నిర్మాణ వ్యయం కూడా భారీగా పెరుగుతుందని కేంద్రం సహా పలు సంస్ధలు గగ్గోలు పెడుతున్నా.. ప్రభుత్వం మాత్రం ముందుకెళ్లాలని నిర్ణయించింది.
💥 రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ప్రారంభం:
ఏపీలో నేటి నుంచి సాగునీటి ప్రాజెక్టుల రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. 👉కీలకమైన పోలవరం జాతీయ ప్రాజెక్టుతో పాటు వంశధార, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వెలుగొండ వంటి ప్రాజెక్టుల్లోనూ మొత్తం రూ.19 వేల కోట్ల మేర విలువైన పనులకు రివర్స్ టెండరింగ్ కు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది.
🔵తొలి విడతలో పోలవరం పనులు :
నేడు పోలవరం ప్రాజెక్ట్ పనుల రివర్స్ టెండరింగ్ కు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనుంది. టెండర్లలో పాల్గొనేందుకు గత కాంట్రాక్టర్ నవయుగకు కూడా అవకాశం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా తొలి విడతలో ఈనెల 17న పోలవరం జాతీయ ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దీని ప్రకారం ఇంకా మిగిలి ఉన్న రూ.39 వేల కోట్ల విలువైన పనులను తక్కువ రేటుకు చేసేందుకు ముందుకొచ్చే వారికి కట్టబెట్టేందుకు వీలుగా ప్రభుత్వం మరోసారి టెండర్లు పిలవనుంది. ఈ ప్రక్రియ అంతా ఎట్టిపరిస్ధితుల్లోనూ సెప్టెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంగా ఉంది.
💥నవంబర్ 1నాటికి :
అంతా సవ్యంగా జరిగితే నవంబర్ 1నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు తిరిగి ప్రారంభమవుతాయి.
🔴గత ప్రభుత్వం పని తీరు పై విమర్శ లు:
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఖజానా ఖాళీగా ఉందంటూనే అడ్డగోలుగా రేట్లు పెంచి కాంట్రాక్టర్లకు ప్రాజెక్టు నిధులను దోచిపెట్టారని వైసీపీ ఆరోపిస్తోంది. ఇందుకోసం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాల్ని భారీగా పెంచారని విమర్శిస్తోంది.
👉దీంతో రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టుల్లో రివర్స్ టెండరింగ్ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం.. తొలి విడతగా అక్రమాల నిర్ధారణ కోసం పోలవరం ప్రాజెక్టు పనుల్లో అవినీతిని వెలికి తీసేందుకు నిపుణుల కమిటీని నియమించింది. రివర్స్ టెండరింగ్ ను వ్యతిరేకిస్తున్న వారికి తమ చర్యలతో గట్టిగా సమాధానం చెప్పాలని ప్రభుత్వం కోరుకుంటోంది.ఈ కమిటీ నివేదిక ఆధారంగా పోలవరం పనుల్లో భారీగా అవినీతి జరిగిందని నిర్ధారణకు వచ్చిన ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ కు తెరలేపుతోంది. రేపు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత త్వరలో టెండర్ల ప్రక్రియ చేపడతారు. ఇందులో ప్రాజెక్టు పనుల్లో మిగిలిన వాటిని పూర్తి చేసేందుకు అత్యల్ప ధరను కోట్ చేసిన వారికి పనులు అప్పగిస్తారు. ఈ టెండరింగ్ లో పాత కాంట్రాక్టర్ నవయుగ ఇంజనీరింగ్ సంస్ధతో పాటు ఇతరులకూ అవకాశం కల్పిస్తున్నారు. ఇందులో ఎంత మొత్తం మిగులుతుందో ప్రజలకు చూపించాలనేది సీఎం జగన్ పట్టుదలగా ఉంది. అదే జరిగితే మిగతా ప్రాజెక్టుల్లోనూ ఇదే ప్రక్రియ అమలు చేసి తక్కువ ధరలకే ప్రాజెక్టులు పూర్తి చేశామన్న ఘనతతో పాటు ప్రభుత్వ ఖజానాకు మిగిల్చిన సొమ్ముకు సంబంధించిన వివరాలను కూడా ప్రజల ముందు ఉంచాలని జగన్ భావిస్తున్నారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.