Teluguwonders:
తెలంగాణ టీడీపీలో రావుల చంద్రశేఖర్ రెడ్డి ఒక ముఖ్యనేత. చంద్రబాబునాయుడికి ముఖ్య అనుచరుడు. టీటీడీపీ తరఫున కొంచెం ప్రజలకు, మీడియాకు తెలిసిన ప్రముఖుడు.
💥 ఆపరేషన్ ఆకర్ష్ :
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ చాపకింద నీరులా తమ పని కానిచ్చేస్తుంది. వివిధ పార్టీల్లో ఉన్న ముఖ్యనేతలు, గతంలో ఓ వెలుగు వెలిగిన ముఖ్య నాయకులను తమ వైపు తిప్పుకొనేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడికి ముఖ్య అనుచరుడిగా ఉన్న రావుల చంద్రశేఖర్ రెడ్డిపై బీజేపీ ఆపరేషన్ కమలాన్ని ప్రయోగించింది.
🔴రావుల చంద్రశేఖర్ రెడ్డి:
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి. జూన్ 1, 1955న కొత్తకోట మండలం కానాయపల్లిలో జన్మించిన చంద్రశేఖర్ రెడ్డి బీఎస్సీ, ఎల్‌ఎల్‌బి అభ్యసించారు. 1982లో కానాయపల్లి సర్పంచిగా రాజకీయ జీవితం ప్రారంభించి, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి, 1985లో తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శిగా, 1987లో అధ్యక్షుడిగా ఎన్నికైనారు. 1989లో రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ చైర్మెన్‌గా నియమితులైనారు. 1991లో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా రెండోసారి నియమించబడ్డారు. 1994లో వనపర్తి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై 1996లో ప్రభుత్వ విప్ గా కూడా పనిచేశారు. 2002, 2008లలో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైనారు. 2009లో వనపర్తి నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. తెలంగాణలో టీడీపీ నుంచి నేతలు టీఆర్ఎస్‌లోకి వలస వెళ్లిపోయినా ఆయన మాత్రం పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. చంద్రబాబునాయుడితో ఉన్న ‘అనుబంధం’ వల్లే ఆయన టీడీపీతో ఉన్నారని పార్టీ నేతలు చెబుతారు.
🔴బీజేపీ నేత ఫోన్ సంభాషణ:
బీజేపీలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఒక ముఖ్య నేత ఒకరు రావుల చంద్రశేఖర్ రెడ్డికి ఫోన్ చేసి.. ‘తెలుగుదేశం పార్టీలో ఏముంది. మా దాంట్లోకి వచ్చేసెయ్. భవిష్యత్తు మాదే.’ అని మాట్లాడినట్టు తెలిసింది.
🔴ఆయన సమాధానంతో మైండ్ బ్లాంక్:
అయితే, రావుల చంద్రశేఖర్ రెడ్డి ఇచ్చిన సమాధానానికి ఆయన మారు మాట్లాడకుండా ఫోన్ పెట్టేశారని సమాచారం. బీజేపీ నేత ఫోన్ చేయగా, ‘తెలంగాణలో మాకు ఎమ్మెల్యేలు లేరు. మీకు మాత్రం ఉన్నది ఒక్కరేగా. మీకు, మాకు పెద్ద తేడా ఏముందిలే..’ అని రావుల సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. దీంతో ఆ బీజేపీ నేత మౌనంగా ‘నీ ఇష్టం’ అని ఫోన్ పెట్టేసినట్టు సమాచారం.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.