Teluguwonders:
తిరుమలలో మీడియాతో మాట్లాడిన రాయపాటి సాంబశిరావు తెలుగు రాష్ట్రాల్లో పట్టుపెంచుకునేందుకు బీజేపీ పక్కా ప్లాన్ తో అడుగులు వేస్తోందని తెలిపారు.
🔴బీజేపీ మాస్టర్ స్కెచ్ ఇది :
దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేయాలని వ్యూహాత్మకంగా అడుగుల వేస్తున్నట్లు తెలిపారు.
💥ఆ ఇద్దర్నీ కూడా:
తెలుగు రాష్ట్రాల్లో ముందు కేసీఆర్, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ను సాగనంపేలా వ్యూహం సిద్ధం చేస్తోందంటూ బీజేపీ ప్లాన్ ను బట్టబయలు చేశారు.
🔴చంద్రబాబుకు తెలుసు :
మరోవైపు తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపైనా మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు అన్నీ తెలుసునని అయినా తెలియనట్లు ఉంటారంటూ విమర్శించారు.
గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమికి చంద్రబాబు నాయుడే కారణమని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయాల్లో జాప్యం ఎక్కువగా ఉంటుందని అందువల్లే గత ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలయ్యిందని చెప్పుకొచ్చారు.
💥జగన్ పాలన బాగుంది -రాయపాటి సాంబశివరావు :
ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వంపై రాయపాటి సాంబశివరావు ప్రశంసలు కురిపించారు. జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన సంక్షేమపథకాలు చాలా బాగున్నాయి అంటూ కితాబిచ్చారు.
నరసరావుపేట మాజీ, టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు ఏపీలోని వైసీపీ ప్రభుత్వం పనితీరు పట్ల సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో సీఎం జగన్ పరిపాలన బాగుందని వ్యాఖ్యానించారు. అయితే జగన్ ప్రభుత్వానికి కేంద్రం సహకరించలేదని రాయపాటి అభిప్రాయపడ్డారు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న పోలవరం ప్రాజెక్ట్ రీ టెండరింగ్ నిర్ణయం సరికాదని రాయపాటి వ్యాఖ్యానించారు.
ఇలా చేయడం వల్ల ప్రాజెక్టు వ్యయం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రాయపాటి… బీజేపీలోకి వెళతారని ప్రచారం జరుగుతోంది. బీజేపీ సీనియర్ నేత రాంమాధవ్ స్వయంగా రాయపాటి ఇంటికి వచ్చి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ
💥రాయపాటి వైసీపీలో చేరతారా ..?
సాంబశివరావు బీజేపీలో చేరతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న తరుణం లో.. బీజేపీపై ఆయన విమర్శలు చేయడం, సొంతపార్టీ అధినేతపై కన్నెర్ర జేయడం, జగన్ ను పొగడ్తలతో ముంచెత్తడం చూస్తుంటే రాయపాటి వైసీపీలో చేరతారా అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.