షాకింగ్ న్యూస్ : మాజీ కేంద్రమంత్రి చిదంబరం అరెస్ట్

Shocking news: Former Union minister Chidambaram arrested
Spread the love

Teluguwonders:

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం చేసుకున్న ముందస్తు బెయిలు పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడం, సుప్రీంలోనూ చుక్కెదురవడంతో నాటకీయ పరిణామాల మధ్య సీబీఐ అరెస్టు చేసింది.

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం జీవితం ఎక్కడ మొదలైందో తిరిగి అక్కడే వచ్చింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరాన్ని సీబీఐ బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

🔴2010 లో :

ఓ ఎనిమిదేళ్ల వెనుక్కు వెళితే ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయాన్ని నాటి హోం మంత్రి చిదంబరం ప్రారంభించారు. ఇప్పుడు అదే ఆఫీసులో నిందితుడిగా నిలబడ్డారు. దీనికి ముందు 2010లో ప్రస్తుతం కేంద్ర హోం మంత్రి, బీజేపీ నేత అమిత్ షాను సోహబ్రుద్దీన్ షేక్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసులో సీబీఐ అధికారులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అప్పటికి చిదంబరం హోం శాఖ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు చిదంబరానికి ఢిల్లీ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ కోరినట్టుగానే.. అప్పట్లో అమిత్ షాకు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ గుజరాత్ హైకోర్టును కోరింది.

రాజకీయ బలంతో అమిత్ షా సాక్షులను భయపెట్టి ఆధారాలు లేకుండా చేసే ప్రమాదం ఉందని సీబీఐ ఆందోళన వ్యక్తం చేసింది. మూడు నెలల తర్వాత 2010 అక్టోబర్ 29న అమిత్ షా‌కి గుజరాత్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరుసటి రోజే కోర్టు వారంతాపు సెలవు రాగా.. సీబీఐ జస్టిస్ అఫ్తాబ్ ఆలమ్‌ను ఆశ్రయించింది. అమిత్ షా 2010 నుంచి 2012 వరకు గుజరాత్‌లో అడుగు పెట్టకుండా బహిష్కరిస్తూ ఆయన ఆదేశాలు జారీ చేశారు.

🔵చిదంబరం :

తమిళనాడులోని శివగంగ జిల్లా కనడుకథన్‌లో జన్మించిన ఆయన మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో విద్యాభ్యాసం చేశారు. మదురై యూనివర్సిటీ నుంచి లా, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి 1968లో ఎంబీఏ పట్టా పొందారు. తండ్రి వ్యాపారవేత్త అయినా వాటిపై అంతగా ఆసక్తి చూపని చిదంబరం, న్యాయవాదిగానే మద్రాసు హైకోర్టులో ప్రాక్టీసు ప్రారంభించారు. తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు దక్కించుకున్న ఆయన చెన్నై, ఢిల్లీలో కార్యాలయాలు ఏర్పాటుచేసి హైకోర్టులు, సుప్రీంకోర్టులో పలు కేసులను విజయవంతంగా వాదించారు.
ఇక, 1984లో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన తొలిసారి తమిళనాడులోని శివగంగ పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగి విజయం అందుకున్నారు. అక్కడ నుంచి వరుసగా ఏడుసార్లు 1989, 1991, 1996, 1998, 2004, 2009లో ఎంపీగా ఎన్నికయ్యారు. 1996, 2004లో కేంద్ర ఆర్థిక మంత్రిగా, 2008 నుంచి 2012 వరకు హోం మంత్రిగా పనిచేశారు. ప్రణబ్ ముఖర్జీని రాష్ట్రపతిని చేయడంతో తిరిగి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉన్న 74 ఏళ్ల చిదంబరం ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.

👉ఐఎన్‌ఎక్స్‌ మీడియా కుంభకోణం లో :

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కుంభకోణం కేసులో సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసుల్లో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని చిదంబరం దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు మంగళవారం నిరాకరించిన సంగతి తెలిసిందే.

💥‘లుకౌట్‌ సర్క్యులర్‌’ :

దీంతో చిదంబరం తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తక్షణం దీనిపై విచారణ చేపట్టాలన్న వీరి వినతిని న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో ఆయన అరెస్టుకు సీబీఐ, ఈడీ అధికారులు చిదంబరం నివాసానికి వెళ్లారు. ఆయన అక్కడ లేకపోవడంతో రెండు గంటల్లోగా దర్యాప్తు అధికారి ఎదుట హాజరుకావాలంటూ ఒక నోటీసును అక్కడ అతికించారు.
ఆయన దేశం విడిచి వెళ్లకుండా చూసేందుకు బుధవారం సీబీఐ, ఈడీలు ఆయనపై ‘లుకౌట్‌ సర్క్యులర్‌’ను జారీ చేశాయి. దేశంలోని అన్ని విమానాశ్రయాలు, పోర్టులను అప్రమత్తం చేశాయి. సీబీఐ బృందం బుధవారం మరోసారి ఆయన నివాసానికి వెళ్లింది. ఆయన ఆచూకీ లేకపోవడంతో వెనుదిరిగింది. నాటకీయ పరిణామాల అనంతరం బుధవారం రాత్రి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు అవుతాయంటే ఇదేనేమో..


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading