చిదంబరం సహకరించడం లేదు -సీ.బి.ఐ

Chidambaram not cooperating - CBI
Spread the love

Teluguwonders for Telugu News

Chidambaram:ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మాజీ మంత్రి చిదంబరాన్ని అరెస్ట్ చేసిన సీబీఐ.. గురువారం ఆయన్ను సీబీఐ కోర్టు ముందు హాజరు పర్చింది. విచారణలో భాగంగా తాము సంధించే ప్రశ్నలకు చిదంబరం సమాధానాలు ఇవ్వడం లేదని, తమకు సహకరించడం లేదని కోర్టుకు సీబీఐ తెలిపింది. ఆయన్ను ఐదు రోజుల కస్టడీకి అప్పగించాలని స్పెషల్ జడ్జి అజయ్ కుమార్ కుహార్‌ను సీబీఐ కోరింది. ఈ కేసులో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సీబీఐ తరఫున వాదించారు. చిదంబరం తరఫున కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వీ, వివేక్ టంఖా వాదనలు వినిపించారు.
ఐఎన్ఎక్స్ మీడియా స్కామ్‌ను పూర్తి స్థాయిలో బయటపెట్టడానికి చిదంబరాన్ని కస్టడీలోకి తీసుకొని విచారించడం తప్పనిసరి అని తుషార్ మెహతా న్యాయస్థానానికి తెలిపారు. ఈ కేసులో క్విడ్ ప్రొ క్రోను వెలికి తీయడానికి ఐదురోజులపాటు చిదంబరాన్ని కస్టడీలోకి తీసుకోవడానికి సీబీఐకి అనుమతి ఇవ్వాలని కోరారు. ఢిల్లీ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిన విషయాన్ని గుర్తు చేశారు.

🔴12 ప్రశ్నలు అడిగింది :Chidambaram 

మాజీ మంత్రిని గత రాత్రి అరెస్ట్ చేసినప్పటికీ.. గురువారం ఉదయం 11 గంటలకే విచారించారని సిబల్ వెల్లడించారు.
సీబీఐ కేసు మొత్తం ఇంద్రాణి ముఖర్జియా వాంగ్మూలం ఆధారంగానే ముందుకెళ్తోందని అభిషేక్ సింఘ్వీ విమర్శించారు. చిదంబరాన్ని సీబీఐ 12 ప్రశ్నలు అడిగిందని, వాటిలో ఆరింటికి ఆయన గతంలోనే సమాధానం ఇచ్చారని కపిల్ సిబల్ తెలిపారు. 👉దర్యాప్తు సంస్థ ఐదుసార్లు పిలిచినా వెళ్లకపోతే దాన్ని సహాయ నిరాకరణగా భావించొచ్చు. కానీ వాళ్లకు నచ్చినట్టుగా బదులివ్వకపోవడం సహాయ నిరాకరణ కాదు. సీబీఐ అధికారులు చిదంబరాన్ని ఓసారి పిలవగా.. ఆయన వెళ్లారు. ఇందులో సహకరించకపోవడం ఎక్కడుంది? అని అభిషేక్ సింఘ్వీ ప్రశ్నించారు.
చిదంబరాన్ని కస్టడీలోకి తీసుకున్న తర్వాత పాత ప్రశ్నలే మళ్లీ అడుగుతున్నారని, ఆయన్ను సీబీఐ కస్టడీలోకి తీసుకునేందుకు అనుమతి ఇవ్వొద్దన్ని సింఘీ న్యాయస్థానాన్ని కోరారు. కాగా, ఓపెన్ కోర్టులో కొన్ని నిజాలను మాట్లాడలేమని సొలిసిటర్ జనరల్ న్యాయస్థానానికి తెలిపారు.

🔴Chidambaram మాట్లాడుతూ:

ఈ కేసు విషయంలో చిదంబరం సీబీఐ కోర్టులో మాట్లాడారు. తనకు ఇంద్రాణి ముఖర్జియా తెలీదన్నారు. తన కుమారుడికి మాత్రమే విదేశాల్లో బ్యాంకు అకౌంట్ ఉందని, తనకు లేదని అన్నారు. ఈ కేసు వల్ల గత 24 గంటలు నిద్రలేకుండా గడిపానని చెప్పారు.

🤣చిదంబరంపై నెటిజనులు సెటైర్లు :

ఈ కేసు విషయం ఎలా ఉన్నా.. నెటిజనులు మాత్రం చిదంబరంపై మీమ్స్ తయారు చేసి సెటైర్లు పేల్చుతున్నారు. మాజీ కేంద్ర మంత్రి చిదంబరాన్ని నెటిజనులు ఆడేసుకుంటున్నారు. మోదీ వచ్చే.. చిద్దు భద్రం అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. కడుపుబ్బా నవ్విస్తున్నారు.

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం సీబీఐతో దోబూచులాడిన సంగతి తెలిసిందే. చివరికి బుధవారం రాత్రి సీబీఐకు చిక్కారు. ఈ నేపథ్యంలో చిదంబరంపై సోషల్ మీడియాలో జోకులు, సెటైర్లు చక్కర్లు కొడుతున్నాయి. #ChiddiBhagModiAaya, #BhagodaChiddu ట్రెండవుతున్నాయి.

కార్తీ చిదంబరంపై CBI FIR

Chidambaram Properties… !!!
ఇది మన కంటి చూపును అస్పష్టం చేస్తుంది మరియు మనకు మైకముగా అనిపిస్తుంది ….
చెన్నైలో 12 ఇళ్ళు, 40 మాల్స్, 16 సినిమా థియేటర్లు, 3 కార్యాలయాలు ఉన్నాయి
తమిళనాడులో 300 ఎకరాల భూమి,
దేశవ్యాప్తంగా 500 వాసన్ ఐ హాస్పిటల్స్
రాజస్థాన్‌లో 2000 అంబులెన్స్‌లు
యుకెలో 88 ఎకరాలు
ఆఫ్రికాలో 3 ద్రాక్షతోటలు + గుర్రాలు.
శ్రీలంకలోని 3 రిసార్ట్స్ శ్రీలంకలో ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ …
కార్తీ చిదంబరం సంస్థ ‘లంక బార్డ్సన్ రెసిడెన్సెస్’ యొక్క చాలా షేర్లను కొనుగోలు చేసింది.
సింగపూర్, మలేషియా & థాయ్‌లాండ్‌లోని ఆస్తులు.
బార్సిలోనా (స్పెయిన్) లోని 4 ఎకరాల్లో 11 టెన్నిస్ కోర్టులతో డెన్నిస్ అకాడమీ.
అదేవిధంగా, కార్తీ చిదంబరం యొక్క సింగపూర్ ఫ్రాంచైజ్ ఫిలిప్పీన్స్కు చెందిన ఒక సంస్థతో సంబంధం కలిగి ఉంది … ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్లో పాల్గొనే జట్టును కూడా కొనుగోలు చేసింది.
దుబాయ్ మరియు ఫ్రాన్స్‌లో అనేక లక్షల కోట్ల రూపాయల లాభదాయకమైన పెట్టుబడులు …
లండన్, దుబాయ్, దక్షిణాఫ్రికా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, సింగపూర్, మలేషియా, శ్రీలంక, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్, ఫ్రాన్స్, యుఎస్‌ఎ, స్విట్జర్లాండ్, గ్రీస్, స్పెయిన్ దేశాల్లో మొత్తం 14 మిలియన్ రూపాయల్లో డబ్బు పెట్టుబడి పెట్టారు.
ఈ పెట్టుబడులన్నీ ఎయిర్‌సెల్-మాక్సిస్‌లో జరిగిన 2006 తర్వాత జరిగాయి
2011 లో, UK లో ఒక మిలియన్ పౌండ్ల విలువైన ఆస్తి …
కార్తీ చిదంబరం సింగపూర్ కంపెనీని సొంతం చేసుకుంది.
అదేవిధంగా, తుష్ యొక్క తల నేతృత్వం వహిస్తుంది …
‘ఎడారి ట్యూన్స్ లిమిటెడ్’, ‘ఫేల్ దుబాయ్ ఎఫ్ఎక్స్. LLC ల కంపెనీలు …
కార్తీ చిదంబరం సింగపూర్ కంపెనీలో పెట్టుబడి పెట్టారు.
కార్తీ చిదంబరం సింగపూర్ కంపెనీ మరో రియల్ ఎస్టేట్ కంపెనీ భాగస్వామ్యంతో …
మలేషియాలోని కంపెనీలో పెట్టుబడులు పెట్టారు …
థాయ్‌లాండ్‌లో 16 భూములు కొనడం
ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం మూలాల నుండి తెలుసుకుంది.
కార్తీ చిదంబరం ‘అడ్వాంటేజ్ స్ట్రక్చరల్ కన్సల్టింగ్’
ఎయిర్‌సెల్-మాక్సిస్ యొక్క డబ్బు లావాదేవీ వెల్లడించింది.

పి.చిదంబరం కేంద్ర మంత్రిగా పనిచేశారు
2006 మరియు 2014 మధ్య, ఈ కాలంలో
కార్తీ చిదంబరం విదేశాలలో ఆస్తులను సొంతం చేసుకున్నారు.
ఇది ఆర్టీఐ నుండి 100% నిజం.
(అందుకున్నట్లు ఫార్వార్డ్ చేయబడింది)


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading