Teluguwonders:
గత 10 రోజులుగా కొత్త ట్రాఫిక్ రూల్స్ తో వాహనదారులు వణికిపోతున్నారు. దేశంలో జరిగే రోడ్డు ప్రమాదాలను అదుపు చెయ్యడానికే కొత్త ట్రాఫిక్ రూల్స్ నిర్ణయాలను తీసుకున్నారు. దీంతో మధ్యతరగతి వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. రోడ్డుపైకి రావాలంటేనే తెగ భయపడుతున్నారు. మరి కొంతమంది కొత్తగా బైక్ తీసుకొని ఈఎంఐ లో బైక్ కి డబ్బులు కడుతున్న ఆ బైక్స్ ని బయటకు తియ్యడం లేదు.
కారణం బైక్ నడిపే వారికీ చలాన్ పడితే ప్రతినెల కట్టే ఈఎంఐ’కంటే చలానా లో జరిమానాననే ఎక్కువ ఉంటుంది. దీంతో వాహనదారులు అందరూ జరిమానాలు చూసి బెంబేలెత్తుతున్నారు. అయితే విన్నూతంగా గుజరాత్ ముఖ్యమంత్రి చలాన్లను దాదాపు సగం తగ్గించి అందరిని ఆశ్చర్య పరిచాడు.
కొంతమంది ఈ జరిమానాలు తగ్గిస్తుంటే మరికొంతమంది ఈ చలాన్ మంచిదే అంటే వ్యాఖ్యానిస్తున్నారు. ఆలా వ్యాఖ్యానిచ్చిన వాళ్లలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఒకరు. వాహనదారులు అందరు అనవసరంగా ట్రాఫిక్ చలాన్లు విధిస్తున్నారని వాపోతుంటే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మాత్రం రూల్స్ బ్రేక్ చేస్తే ఫైన్ కట్టాల్సిందే అంటూ వ్యాఖ్యానించారు. తప్పు చెయ్యకుంటే జరిమానాలు కట్టాల్సిన అవసరం లేదని, ఈ జరిమానాలు ఉంటె కొంత కాలం మన దేశంలో ట్రాఫిక్ క్రమబద్ధంగా ఉంటుందని గడ్కరీ అభిప్రాయపడ్డారు.
అయితే గడ్కరీ అభిప్రాయంతో తెలంగాణ మంత్రి, టీఆరెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఏకీభవించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే జరిమానాలు కట్టాల్సిందే అని అన్నారు. జరిమానాలు కూడా తప్పు పడితే ఎలా అని ప్రశ్నించారు కేటీఆర్. దీంతో ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.