కాశ్మీర్ గౌరవాన్ని కాపాడేది భారత్ మాత్రమే :ముస్లిం సంస్థ ప్రకటన

Spread the love

Teluguwonders:

జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని భారత ప్రభుత్వం ఆగస్టు 5న రద్దు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పాక్‌ భారత్‌పై తన అక్కసు వెల్లగక్కుతోంది. మధ్యవర్తిత్వం వహించాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరుతోంది. ఈ క్రమంలో యూఎన్‌ ఈ విషయంపై స్పందిస్తూ అది రెండు దేశాల ద్వైపాక్షిక విషయమే అనడం గమనార్హం. ఈ విషయంలో మేము జోక్యం చేసుకోలేం. ఇది భారత్‌, పాక్‌లే ద్వైపాక్షికంగా చర్చించుకుని పరిష్కరించుకోవాలి’ అని అన్నారని యూఎన్‌ ప్రతినిధి స్టీఫెన్‌ డుజరిక్‌ స్పష్టం చేశారు.
జమ్మూకశ్మీర్‌ అంశంలో పాకిస్థాన్‌ చేస్తున్న వాదనలకు అంతర్జాతీయంగా మద్దతు కరవవుతోంది. దీంతో దాయాది కల్లుతాగిన కోతిలా ఎగిరిపడుతూ కయ్యానికి కాలుదువ్వుతోంది.

🔴ముస్లిం సంస్థ కీలక ప్రకటన -కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమే..:

జమియత్ ఉలామియా హింద్ (జేయూహెచ్) సంస్థ తమ జేయూహెచ్ వార్షిక సాధారణ సమావేశంలో ఒక తీర్మానం చేశారు. కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని ఆ సంస్థ తీర్మానించింది. అంతేకాదు, లోయలో ప్రజా సంక్షేమం భారతదేశంలో ఏకీకరణతోనే ఉందని అన్నారు. ఈ సందర్భంగా పాకిస్థాన్‌పై తీవ్రంగా విరుచుకుపడింది.
శత్రు మూకలు, పొరుగు దేశం కశ్మీర్‌ను నాశనం చేయడానికి ప్రజలను పావుగా ఉపయోగించుకోడానికే మొగ్గు చూపుతోందని దుయ్యబట్టింది. కశ్మీరీల ఆత్మగౌరవం, సాంస్కృతిక గుర్తింపును కాపాడుకోవాలన్న డిమాండ్ గురించి పాకిస్థాన్ పట్టించుకోవడం లేదని ఆరోపించింది.

భారత్‌లో ఉండటం వల్లే కశ్మీరీల సంక్షేమం జరుగుతుందని బలంగా నమ్ముతున్నట్టు జేయూహెచ్ వెల్లడించింది. అలాగే, వేర్పాటువాద ఉద్యమాలకు ఎట్టిపరిస్థితుల్లో మద్దతిచ్చే ప్రసక్తేలేదని పేర్కొంది. ఇలాంటి ఉద్యమాలు భారత్‌కే కాదు కశ్మీరీ ప్రజలకు హాని కలిగిస్తాయని ఉద్ఘాటించింది.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading