జగన్‌-కేసీఆర్‌ ల పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు

Chandrababu made serious comments on Jagan-KCR
Spread the love

Teluguwonders:

జగన్‌-కేసీఆర్‌ ఏపీకి అన్యాయం చేస్తున్నారని తెదేపా విస్త్రృత స్థాయి సమావేశంలో చంద్రబాబు వ్యాఖ్యానించారు.

🔴ప్రజల స్వేచ్ఛను హరించేలా:

విజయవాడ ఏ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన తెదేపా రాష్ట్రస్థాయి విస్తృత సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ప్రజల స్వేచ్ఛను హరించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెదేపా జాతీయ అధ్యక్షుడుచంద్రబాబు వ్యాఖ్యానించారు.

🔴పోరాట బాట తప్పడంలేదు :

మంచిగా పని చేస్తే నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిద్దామనుకున్నామని, ప్రభుత్వం విధ్వంసకరంగా పని చేస్తున్నందున పోరాట బాట పట్టక తప్పడంలేదన్నారు. జగన్‌ ‘పులివెందుల పంచాయితీలు’ రాష్ట్రంలో చేయనివ్వమని హెచ్చరించారు.

బదిలీలు, ఇతర వత్తిళ్లకు లొంగి వైకాపా దాడుల పట్ల పోలీసులు ఉదాసీనంగా ఉండటం తగదన్నారు. సభాపతి తన హుందాతనాన్ని కాపాడుకోవాలని హితవు పలికారు. మంచి నిర్ణయాలను ఎప్పుడూ ప్రోత్సహిస్తామని, అందులో భాగంగానే ఆర్టికల్‌ 370 రద్దుకు మద్దతు పలికామని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ నిలిపివేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉచిత ఇసుకను అమలు చేస్తే ఎన్నో విమర్శలు చేశారని, ఇప్పుడు అధిక ధరకు విక్రయిస్తున్నారని మండిపడ్డారు. దీనిని బట్టి ఇసుక దోపిడీకి ఎవరు పాల్పడ్డారో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు.‘‘ పేదవాడికి రూ.5 కే అన్నం పెట్టే ‘అన్న’ క్యాంటీన్లను మూసేశారు. అనేక సంక్షేమ పథకాలు రద్దు చేశారు. వీటన్నిటిపైనా పోరాడేందుకు కార్యాచరణ రూపొందించుకుందాం’’ అని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు.

🔴కేసీఅర్ అలా చేయకూడదు :

గోదావరి నీటిని తెలంగాణ భూభాగంలోకి తీసుకెళ్లి అక్కడి నుంచి శ్రీశైలానికి తెస్తామనడం అన్యాయమని చంద్రబాబు ఆరోపించారు. జగన్‌- కేసీఆర్‌ ఆంధ్రాకు అన్యాయం చేసేలా ఆలోచిస్తున్నారని అన్నారు. మన భూభాగం నుంచే నీటిని తీసుకెళ్లే ప్రాజెక్టులకు ఆలోచనలు చేయాలని, 450 కిలోమీటర్లు నీటిని తీసుకుపోవడం ప్రజల సెంటిమెంట్‌కు సంబంధించిన విషయమని అన్నారు. ఇది ఇద్దరు ముఖ్యమంత్రులు అనుకొని చేసే కార్యక్రమం కాదని చంద్రబాబు మండిపడ్డారు. స్వార్థ నిర్ణయాలతో రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీయొద్దని హితవు పలికారు.జగన్‌-కేసీఆర్‌ ఏపీకి అన్యాయం చేస్తున్నారని,
ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి తెచ్చుకోవద్దని పాలక పక్షాన్ని,పక్క రాష్ట్రాన్ని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *