ఒక చక్కటి అనుబంధానికి కావలిసిన మూడు విషయాలు కన్నీరు రాని కళ్ళు , అబద్దాలు చెప్పని పెదాలు , మనసుకు నచ్చే నిజమైన ప్రేమ. కొన్ని బంధాలు ఎలా ఉంటాయి అంటే వాటిని బంధాలు అనడం కంటే సంబంధాలు అనడమే కరెక్ట్. ఎందుకంటే ఈ రోజుల్లో తెలియని వాళ్ళతో కూడా సంబంధాలు పెట్టుకొని చివరికి అవి ఒకరినొకరిని చంపుకునే వరకు వెళుతున్నాయి. ఇది చాలదు అన్నట్టు ఇప్పుడు కొత్తగా ఫేసుబుక్ ఫ్రెండ్ షిప్ అంటూ చాటింగ్ వరకు తీసుకెళ్లి చంపేస్తున్నారు. పరిచయం ఐనా ఒకటి ,రెండు రోజుల్లో నే రిలేషన్ షిప్ లు పెట్టుకుంటూ సగం జీవితాల్ని చేతులరా నాశనం చేసుకుంటున్నారు.
ఇలా చేస్తూ నిజమైన బంధాలుకు కూడా విలువ లేకుండా చేస్తున్నారు. ” బంధం ” అంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి. బాధల్లో తోడు ఉండాలి. మనస్పర్థలు ఎన్ని వచ్చిన , ఎన్ని ఆటంకాలు ఎదురైన , ఎన్ని అడ్డంకులు వచ్చిన నీకు నేను ఉన్నా అని ఒక బంధం మనతో చెప్పిస్తుంది. బంధం విలువ తెలిసిన వాళ్ళకి ఎక్కడ తగ్గాలో , ఎక్కడ నెగ్గాలో బాగా తెలుస్తుంది.
కొన్ని సంబంధాలు అద్దె ఇల్లు లాంటివి …వాటితో ఎంత ప్రేమగా ఉన్నా ..ఎంత నిజాయితీగా గా ఉన్నా ఎప్పటికీ వాళ్ళు మనవాళ్ళు కాలేరు. పడిపోతే పగిలిపోయే ఫోన్ కే ఎంతో విలువ ఇస్తున్నాం. అలాటిది జీవితాంతం మనతో ఉండే బంధాలకు ఇంకెంత విలువ ఇవ్వాలి. చిన్న చిన్న కారణాలతో బంధాలను దూరం చేసుకోకండి. మీ బంధం ఇతరులను నుండి ఏదయినా ఆశించడం కోసమే ఐతే ….మీరు ఎంత ప్రయత్నించినా ఆ బంధం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అదే బంధం ఇతరులు కు మేలు చేసేది ఐతే ….అప్పుడు అంతా అద్భుతంగా ఉంటుంది.సంబంధాలు కోసమే.
1 ) బంధాన్ని కాపాడుకోవడానికి తల వంచాలిసి వస్తే వంచేయి …కానీ ప్రతి సారీ నువ్వే తల వంచాలిసి వస్తే ఆ బంధాన్ని వదిలేయి. జీవితం అంతా తల దించుకుని బ్రతకడం ఆసాధ్యమే !!
2) బంధం నిలబడాలి అంటే అర్థం చేసుకొనే మనసు ఉంటే చాలు. ఖరీదైనా బహుమతులు ఇస్తూ మాటకి ముందు , మాటకి వెనుక బంగారం అంటూ అస్తమానం పిలవాలిసిన అవసరం లేదు.
3 ) జీవితంలో మనుషులు రెండే రెండు సార్లు మారుతారు. ఆస్తులు , అంతస్తలు కాదు మనిషికి కావాలిసింది. అనుబంధాలు, ఆత్మీయతలు . ఆస్తులు కరిగిపోయిన బ్రతకగలము . అనుబంధాలు దూరమైతే జీవించలేము. మీకు విలువ ఇవ్వని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ విలువ ను పోగొట్టుకోకండి. మీ ముందు ఒకలా, మీ వెనుక మరోలా ఉండేవారిని దూరం పెట్టండి. అభిమానించే వాళ్ళను, ప్రేమించే వాళ్ళను , సహాయం చేసే వాళ్ళను ఎప్పుడు దూరం చేసుకోకండి. ” ఒకరితో మన బంధం మంచిగా ఉంటే నిన్నటి గొడవలు నేటి సంబంధాలను గాయపరచలేవు ” .
4) బంధం అన్నది అందమైన పుస్తకం లాంటిది. పొరపాటు అనేది అందులో ఒక పేజీ మాత్రమే . ఒక పొరపాటు జరిగితే సవరించాలి కానీ ..!! మొత్తం పుస్తకాన్ని చించివేయకూడదు. “సంబంధాలు ఎప్పుడూ మాములుగా చంప పడవు. అవి ఒకరి ప్రవర్తన వలన మాత్రమే చంపబడతాయి” . నిన్ను భారం అనుకొనే బంధాలతో బలవంతంగా జీవించే కంటే వాటికి దూరమై ఒంటిరిగా బ్రతకడమే సంతోషం. లోకంలో అతి పెద్ద ద్రోహం ఏంటో తెలుసా …ఒకరిపై అతిగా ప్రేమ చూపించి …అదే నిజమైన ప్రేమని నమ్మించి మోసం చేయడమే !!
5 ) నువ్వు అలిగావని నేనూ అలిగితే …ఆ బంధం నిలబడదు….బంధం నిలబడాలంటే ..బాధ భరించాలి, బతిమాడాలి, బుజ్జగించాలి, అప్పుడే ఆ బంధం శాశ్వతం గా నిలుస్తుంది. బాధను భరిస్తే ” బంధం ” బానిసవుతుంది. ఏ బంధం ఐనా సరే బలపడేముందు బాధిస్తుంది. “అర్థం కాని బంధం అర్థం లేని సంబంధం రెండు ఒకటే ” నీ భావాలకు విలువ నిచ్చే వారు, నిన్ను ప్రేమించేవారు , నీ పట్ల శ్రద్ద వహించే వారినెపుడూ ఆ శ్రద్ద చేయకండి. ఎదో ఒక రోజు మీకు అర్థం అవుతుంది. ఇప్పటికైనా విలువ ఇచ్చే బంధాలు ఏవో , విలువ ఇవ్వని బంధాలేవో తెలుసుకోండి.
ఒకరితో బంధం అనేది దేవుడు రాస్తాడు. ఆ బంధాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి కానీ తుంచుకుంటూ పోకూడదు.