*అండమాన్ లో హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు.. వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించిన మోడీ*
*చెన్నై-అండమాన్ ఆప్టికల్ ఫైబర్ ప్రాజెక్టును ప్రారంభించిన ప్రధాని మోడీ* *మొబైల్, నెట్ కనెక్టివిటీ ప్రాబ్లమ్స్ కు చెల్లు*
*సముద్రం అడుగున 2,313 కిలోమీటర్ల కేబుల్ ఏర్పాటు*
*24 నెలల్లోపే ప్రాజెక్టును పూర్తిచేసిన బీఎస్ఎన్ఎల్*
*అండమాన్ కు ఇండిపెండెన్స్ గిఫ్ట్ అన్న పీఎం*
న్యూఢిల్లీ: ‘‘అండమాన్ నికోబార్ ఐల్యాండ్స్ లో తరచూ ఫోన్ కాల్స్ డ్రాప్ అయ్యేవి. ఇంటర్నెట్ కనెక్టివిటీ పెద్ద సమస్యగా ఉండేది. ఇంటర్నెట్ స్పీడ్ కూడా చాలా తక్కువగా ఉండేది. కానీ.. అండమాన్ ఐల్యాండ్స్ లో ఇక ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ ఉండవు. దేశంలోనే మొదటిసారిగా సబ్ మెరైన్ ఆఫ్టికల్ ఫైబర్ కేబుల్ ద్వారా అండమాన్ లోని డజన్ దీవులకు హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి..’’ అని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. చెన్నై నుంచి అండమాన్ కు సముద్రం అడుగున ఏర్పాటు చేసిన అండర్ సీ ఆప్టికల్ ఫైబర్ ప్రాజెక్టును ప్రధాని మోడీ సోమవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అండమాన్ కు ఇంతకుముందు కంటే ఇప్పుడు 10 రెట్ల స్పీడ్ తో ఇంటర్నెట్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయన్నారు.
*అండమాన్ కు ఇండిపెండెన్స్ గిఫ్ట్..* అండమాన్ కు అండర్ సీ ఆప్టికల్ ఫైబర్ ప్రాజెక్టు రూపంలో ముం దుగానే ఇండిపెం డెన్స్ గిఫ్ట్ ను ఇస్తున్నట్లు ప్రధాని మోడీ చెప్పారు. దేశంలోనే మొదటి అండర్ సీ ఫైబర్ ఆప్టికల్ ప్రాజెక్టు ప్రారంభమైన ఈ రోజు అండమాన్ కు ఒక ‘బిగ్ డే’ అని ఆయన చెప్పారు. దీని ద్వారా అండమాన్ లోని డజన్ దీవులకు బెనిఫిట్స్ అందుతాయన్నారు. అండమాన్ ప్రజలకు మాడర్న్ టెలికం కనెక్టివిటీని అందించడం కేంద్రం బాధ్యత అని చెప్పారు. ఫైబర్ ఆప్టిక్ తో అండమాన్ ను దేశంతో లింక్ చేయడం ద్వారా ఈజ్ ఆఫ్ లివింగ్ దిశగా కేం ద్ర ప్రభుత్వం తన కమిట్ మెంట్ ను చాటుకుందన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల టూరిస్టులకు హైస్పీడ్ ఇంటర్నెట్ అందుతుందని మోడీ చెప్పారు. వేలాది కుటుంబాలకు ఎడ్యుకేషన్, బ్యాంకింగ్, షాపింగ్, టెలీ మెడిసిన్ వంటి సౌకర్యాలు అందుతాయన్నారు.
*12 ఐల్యాం డ్స్ లో హైఇంపాక్ట్ ప్రాజెక్టులు..*
అండమాన్ లోని12 ఐల్యాండ్స్ కు హై ఇంపాక్ట్ ప్రాజెక్టులను కూడా విస్తరిస్తున్నామని ప్రధాని మోడీ తెలిపారు. నార్త్, మిడిల్ అండమాన్ ల మధ్య రోడ్ కనెక్టివిటీని పెంచేందుకు ఎన్ హెచ్4ను మెరుగు పరుస్తామని, రెం డు ప్రధాన బ్రిడ్జిల పనులు జరుగుతున్నాయన్నారు.
*ప్రాజెక్టు స్పెషాలిటీస్ ఇవే..*
చెన్నై, అండమాన్ అండర్ సీ ఆప్టికల్ కేబుల్ పొడవు: 2,313 కి.మి.
అండర్ సీ కేబుల్ పనులను బీఎస్ఎన్ఎల్ సంస్థ రికార్డ్ స్థాయిలో 24 నెలల్లోపే పూర్తి చేసింది.చెన్నై నుంచి పోర్ట్ బ్లెయిర్ కు, అక్కడి నుంచి అండమాన్ నికోబార్ లోని ఏడు ఐల్యాండ్స్ కు ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ఏర్పాటు చేశారు.
పోర్ట్ బ్లెయిర్ కు సెకనుకు 400 గిగాబిట్ల స్పీడ్ తో, ఇతర ద్వీపాలకు 200 గిగాబిట్ల స్పీడ్ తో ఇంటర్నెట్ సేవలు ప్రారంభమయ్యాయి.
ప్రాజెక్టుకు అయిన ఖర్చు: రూ. 1,224 కోట్లు ఆప్టిక్ కేబుల్ కనెక్టివిటీతో ఈ ఐల్యాండ్స్ లో 4జీ మొబైల్ సర్వీసులు అందుతాయి.ఈ ప్రాజెక్టుకు ప్రధాని మోడీ 2018, డిసెంబర్ 30న శంకుస్థాపన చేశారు.
ఈ ప్రాజెక్టుతో టెలీ ఎడ్యుకేషన్, టెలీ హెల్త్, ఇ గవర్నెన్స్ వంటి డిజిటల్ సర్వీసులు, టూరిజం ఊపందుకుంటాయి._