అంబాలాకు చేరిన 5 రఫేల్‌ యుద్ధ విమానాలు

Spread the love

*ఎన్నాళ్లో వేచిన ఉదయం..!* *అంబాలాకు చేరిన 5 రఫేల్‌ యుద్ధ విమానాలు*

*భారత గగనతలంలో వాటికి ఎస్కార్టుగా వచ్చిన సుఖోయ్‌లు*

*వాయుసేన మరింత బలోపేతం: రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌*

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అపురూప ఘట్టం బుధవారం ఆవిష్కృతమైంది. దేశ రక్షణ రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. వాయుసేన పోరాట సామర్థ్యాన్ని బలోపేతం చేస్తూ.. శత్రు భయంకర రఫేల్‌ యుద్ధ విమానాలు ఐదు భారత భూభాగంపై అడుగు పెట్టాయి._

*రఫేల్‌ జిగేల్‌* *అంబాలా వైమానిక స్థావరానికి చేరిన 5 భీకర యుద్ధ విమానాలు*

దేశ రక్షణ రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది! ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అపురూప ఘట్టం బుధవారం ఆవిష్కృతమైంది. వాయుసేన పోరాట సామర్థ్యాన్ని బలోపేతం చేస్తూ.. శత్రువుల గుండెల్లో గుబులు పుట్టిస్తూ ఐదు రఫేల్‌ యుద్ధ విమానాలు మన భూభాగంపై అడుగు పెట్టాయి. ఫ్రాన్స్‌లోని మెరిగ్నాక్‌ వైమానిక స్థావరం నుంచి.. ఏడు వేల కిలోమీటర్లు ప్రయాణించి..

హరియాణాలోని అంబాలా వైమానిక స్థావరంలో దిగాయి. అణ్వస్త్రాలతోనూ దాడి చేయగల సామర్థ్యమున్న ఇవి చైనా, పాకిస్థాన్‌లతో సరిహద్దు వివాదాల నేపథ్యంలో భారత్‌కు కీలకంగా మారే అవకాశముంది. ఫ్రాన్స్‌కు చెందిన దసో ఏవియేషన్‌ కంపెనీ నుంచి 36 రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు ఎన్డీయే ప్రభుత్వం 2016లో రూ.59 వేల కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. దాని ప్రకారం.. ఐదు విమానాలు ఫ్రాన్స్‌ నుంచి యూఏఈకి చేరుకొని, అక్కడి నుంచి అంబాలాకు బుధవారం చేరుకున్నాయి. భారత గగనతలంలోకి ప్రవేశించాక రఫేల్‌ విమానాలకు రెండు సుఖోయ్‌ 30 ఎంకేఐ యుద్ధ విమానాలు అంబాలావరకు ఎస్కార్టుగా వచ్చాయి.

వైమానిక స్థావరంలో ల్యాండ్‌ అయ్యాక ఈ నూతన బహుళ ప్రయోజనకర విమానాలకు వైమానిక దళ చీఫ్‌ ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ భదౌరియా సమక్షంలో జల ఫిరంగులతో వందనం సమర్పించారు.

*ఈ ఐదు.. గోల్డెన్‌ ఆరోస్‌ చేతికి:* భారత్‌కు చేరుకున్న ఐదింటిలో మూడు.. ఒకే సీటు ఉన్న విమానాలు. మిగిలిన రెండింటిలో రెండు సీట్లున్నాయి. వీటిని అంబాలాలోని నంబర్‌-17 స్క్వాడ్రన్‌లో ప్రవేశపెడతారు. ఈ స్క్వాడ్రన్‌ను ‘గోల్డెన్‌ ఆరోస్‌’ అని పిలుస్తారు. భారత్‌కు అంబాలా వైమానిక స్థావరం వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైనది. పాక్‌తో సరిహద్దు నుంచి అది 220 కిలోమీటర్ల దూరంలో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *