నివాస అడ్వాన్స్‌.. 2 నెలల అద్దెను మించరాదు

Spread the love

*నివాస అడ్వాన్స్‌.. 2 నెలల అద్దెను మించరాదు*

*యజమాని, అద్దెకుండేవారి హక్కులు, బాధ్యతలపై అందుబాటులోకి అద్దె చట్టం-2020 ముసాయిదా* 

*అక్టోబర్‌ 31 వరకూ అభిప్రాయాలకు అవకాశం*

హైదరాబాద్‌: యజమానులు, అద్దెకు ఉండేవారి మధ్య వివాదాలకు తావులేకుండా అద్దెచట్టం-2020 ముసాయిదాను కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. అద్దె చట్టానికి తుదిరూపునిచ్చే నేపథ్యంలో ఈ నెల 31 లోపు అభిప్రాయాలను తెలియజేయాలని కోరింది. ఈ క్రమంలో ముసాయిదాను అందుబాటులోకి తెచ్చిన రాష్ట్ర పురపాలకశాఖ.. తమ సూచనలను ఈ మెయిల్‌ ద్వారా పంపాలని ప్రజలను కోరింది. 

*ముఖ్యాంశాలు:* * రాతపూర్వక ఒప్పందంతోనే అద్దెకు తీసుకోవాలి

* నివాస ప్రాంతాల అడ్వాన్స్‌ రెండు నెలల అద్దెకు మించకూడదు

* నివాసేతర ప్రాంతాలకు డిపాజిట్‌ గరిష్ఠంగా 6నెలల అద్దెకు మించరాదు

* వాణిజ్య ఆవాసాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి

* వివాదాల పరిష్కారానికి ఫాస్ట్‌ట్రాక్‌ జ్యుడిషియల్‌ యంత్రాంగం ఏర్పాటు

* యజమాని, లబ్ధిదారు మధ్య అనుబంధ ఒప్పందాన్ని అమలు చేయకుండా సబ్‌లెట్టింగ్‌కు అనుమతించకూడదు

* ఊహించని ఘటనలు జరిగినపుడు అద్దె అగ్రిమెంట్‌ ముగుస్తుంటే ఒక నెలపాటు ఒప్పందం నిబంధనలు అనుమతించాలి * తగిన కారణాలతోనే భూస్వామి ప్రాంగణాన్ని స్వాధీనం చేసుకోవాలి.

* హైకోర్టును సంప్రదించి ప్రతి జిల్లాలో జిల్లా న్యాయమూర్తి, అదనపు న్యాయమూర్తితో అద్దె ట్రైబ్యునళ్ల ఏర్పాటు

*యజమాని బాధ్యతలు..*

* అద్దెదారు వల్ల నష్టం కలగకుండా తప్పనిసరి మరమ్మతులు

* గోడలకు వైట్‌వాష్‌, తలుపులు, కిటికీలకు పెయింటింగ్‌

* అవసరమైనపుడు పైపులు మార్చడం, ప్లంబింగ్‌ చేయించడం

*అద్దెదారులు చేసుకోవాల్సినవి:*

* కుళాయిలు, దుస్తులను ఉతికే యంత్రాలు, కుళాయిల మార్పు

* డ్రెయిన్‌ల శుభ్రత, బాత్‌రూం, బేసిన్‌ తదితరాల మరమ్మతులు

* సర్క్యూట్‌ బ్రేకర్‌ మరమ్మతు, స్విచ్‌లు, సాకెట్‌ మరమ్మతులు

* అంతర్గత, బాహ్య వైరింగ్‌ మార్పులు మినహా విద్యుత్‌ పరికరాల మరమ్మతులు * వంటగదిలోని ఫిటింగ్‌ల మరమ్మతులు 


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading