-బుకింగ్‌పై 5% క్యాష్‌బ్యాక్‌

Spread the love

*రిలయన్స్‌ డిజిటల్‌లో యాపిల్‌ వాచ్‌లు* *ప్రీ-బుకింగ్‌పై 5% క్యాష్‌బ్యాక్‌*

హైదరాబాద్‌: యాపిల్‌ వాచ్‌ల ప్రీ-బుకింగ్‌ సదుపాయాన్ని రిలయన్స్‌ డిజిటల్‌ అందుబాటులోకి తీసుకువచ్చింది. యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 6, యాపిల్‌ వాచ్‌ ఎస్‌ఈతో పాటు 8వ జనరేషన్‌ ఐపాడ్‌లను అన్ని రిలయన్స్‌ డిజిటల్‌ స్టోర్లలో ముందుగానే బుక్‌ చేసుకోవచ్చు.

అంతేగాకుండా మై జియో స్టోర్స్‌, రిలయన్స్‌డిజిటల్‌.ఇన్‌లో సైతం ఈ సదుపాయం ఉన్నట్లు రిలయన్స్‌ డిజిటల్‌ ఒక ప్రకటనలో వివరించింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి యాపిల్‌ వాచ్‌ల విక్రయం మొదలవుతాయి.

యాపిల్‌ వాచ్‌ ఎస్‌ఈ ధర రూ.29,900 నుంచి; సిరీస్‌ 6 యాపిల్‌ వాచ్‌ ధర రూ.40,900 నుంచి ప్రారంభమవుతాయి. ఈ నెల 30వ తేదీ వరకూ reliancedigital.in వెబ్‌సైట్‌ ద్వారా ప్రముఖ బ్యాంకుల కార్డులతో ప్రీ-బుకింగ్‌ చేసుకుంటే 5% క్యాష్‌ బ్యాక్‌ లభిస్తుందని రిలయన్స్‌ డిజిటల్‌ తెలియజేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *