రాజా సాబ్ నుంచి ఫొటో షేర్ చేసిన నిధి అగర్వాల్

director maruthi
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమా ‘ది రాజా సాబ్’. మారుతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా కనిపించనున్నారు.
ఈ చిత్రం హారర్, రొమాన్స్, కామెడీ కథాంశంతో ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ ఏప్రిల్ 10, 2025న విడుదల కానుంది. ఈరోజు దర్శకుడు మారుతి పుట్టినరోజు. ఈ సందర్భంగా నిధి అగర్వాల్ దర్శకుడు మారుతీతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసి అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.
“ప్రియమైన దర్శకుడు మారుతీ సార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. సినిమా పట్ల మీ అభిరుచి, ప్రేమ త్వరలో ప్రపంచవ్యాప్తంగా అనుభూతి చెందుతాయి. మీరు చాలా విజయాలు సాధించాలని మీ జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ ” ట్వీట్ చేసింది.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
