ఏటీఎంలో డబ్బులు లేవా? ఈ టిప్స్ పాటించండి

0

డబ్బులు డ్రా చేయడానికి వెళ్తే ఏటీఎం పనిచేయకపోవడం, ఏటీఎం పనిచేస్తున్నా మెషీన్‌లో డబ్బులు లేకపోవడం లాంటి అనుభవాలు అందరికీ మామూలే. ఏటీఎంలో డబ్బులు లేకపోతే ఖర్చులకు తిప్పలు పడాల్సి రావడం సహజమే. అయితే టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత డబ్బులు పేమెంట్ చేసే మార్గాలు పెరిగాయి. ఏటీఎంలో డబ్బులు లేనప్పుడు ఈ టిప్స్ పాటించండి.

  1. Internet Banking: ఇప్పుడు అన్ని బ్యాంకుల్లో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్ ఉంది. పేమెంట్ల కోసం ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడుకోండి. బిల్లుల చెల్లింపులు, నగదు బదిలీ లాంటి వాటికి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగపడుతుంది.

  2. Internet Banking: ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లో నేషనల్ ఎలక్ట్రానిక్స్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్(నెఫ్ట్), రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్(ఆర్‌టీజీఎస్), ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీసెస్(ఈసీఎస్), ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్(ఐఎంపీఎస్) ఇలా చాలా సేవలున్నాయి. మీ అవసరానికి తగ్గట్టు నెఫ్ట్, ఆర్‌టీజీఎస్, ఈసీఎస్ సేవల్ని ఉపయోగించుకోవచ్చు.

  3. Internet Banking: నెఫ్ట్ ద్వారా పంపితే ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆర్‌టీజీఎస్ అయితే కనీసం రూ.2 లక్షలు, గరిష్టంగా రూ.10 లక్షలు పంపొచ్చు. క్షణాల్లో డబ్బులు ట్రాన్స్‌ఫర్ అవుతాయి. వ్యాపారులు ఎక్కువగా ఆర్‌టీజీఎస్ సేవల్ని వినియోగించుకుంటారు.

  4. Internet Banking: ఐఎంపీఎస్ ద్వారా 24 గంటల పాటు ఎప్పుడైనా డబ్బులు పంపొచ్చు. కాకపోతే ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. దీంతో పాటు బిల్లులు, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ ప్రీమియం, ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ కోసం ఈసీఎస్ సేవల్ని ఉపయోగించుకోవచ్చు.

  5. Mobile Banking: ఇప్పుడు దాదాపు ప్రతీ ఇంట్లో స్మార్ట్‌ఫోన్ కనిపిస్తుంది. అందరూ మొబైల్ డేటా, లేదా వైఫై ఉపయోగిస్తున్నారు. బ్యాంకులు కూడా తమ యాప్స్ ద్వారా సేవల్ని అందిస్తున్నాయి. దీంతో మొబైల్ బ్యాంకింగ్ చాలా సులువైపోయింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లో ఉన్న సేవలన్నీ మొబైల్ బ్యాంకింగ్ ఉపయోగించుకోవచ్చు.

  6. Mobile Wallet: మీరు జేబులో డబ్బులు పెట్టుకోకుండా వెళ్లి కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కొని వచ్చినప్పుడే క్యాష్‌లెస్ అన్న మాటకు సార్థకత. అందుకే మొబైల్ వ్యాలెట్స్ ఉన్నాయి. పేటీఎం, అమెజాన్ పే, ఫోన్‌పే, గూగుల్ పే… ఇలా ఎన్నో మొబైల్ వ్యాలెట్ సర్వీసులున్నాయి.

 

Leave a Reply