చంద్రబాబుకు సెక్షన్ 151 కింద నోటీసులు జారీ-నిలదీసిన లోకేష్

Notices under Section 151 issued to Chandrababu

Teluguwonders:

చంద్రబాబుగారు స్వయంగా పూనుకుంటే తప్ప ప్రభుత్వం కళ్ళు తెరవదా? ఉదయం 8 గంటల నుంచి అక్రమంగా మమ్మల్ని నిర్బంధించారు. ఒక ప్రధాన ప్రతిపక్ష నేతకి ఏ అధికారంతో ఇటువంటి ఆంక్షలు విధించారు? బాధితులకు భరోసాగా ఎందుకు వెళ్లనివ్వలేదు? అని లోకేష్ ట్విట్టర్‌లో స్పందించారు.

👉వివరాల్లోకి వెళ్తే :

బుధవారం రాత్రి 8 గంటల సమయంలో చంద్రబాబు ఇంటి గేటుకు కట్టిన తాడు తీసేశారు .
తాడు తొలగించిన తర్వాత చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు

💥 చంద్రబాబుకు నోటీసులు :

చలో ఆత్మకూరు పిలుపుతో బాబును హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.. 12 గంటల తర్వాత ఇంటి గేటుకు కట్టిన తాళ్లను తొలగించారు. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో తాళ్లను తీసేసి.. సెక్షన్ 151 కింద నోటీసులు జారీ చేశారు.

🔴పోలీసులు తీరుపై మండిపడుతున్న టీడీపీ నేతలు:

12 గంటల నిర్బంధించి.. ఇప్పుడు నోటీసులు ఇవ్వడంపై టీడీపీ నేతలు మండిపడ్డారు. అంతేకాదు బాబుకు ఇచ్చిన నోటీసులో సరైన సమాచారం లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే చంద్రబాబు హౌస్ అరెస్ట్, పోలీసులు నోటీసులు ఇవ్వడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ స్పందించారు.

🔴లోకేష్ మాట్లాడుతూ :

ఉదయం 8 గంటల నుంచి అక్రమంగా మమ్మల్ని బైటికి రాకుండా నిర్బంధించి రాత్రి 8 గంటల వేళ నిర్బంధం సడలింపా? ఒక ప్రధాన ప్రతిపక్ష నేతకి ఏ అధికారంతో ఇటువంటి ఆంక్షలు విధించారు? బాధితులకు భరోసాగా ఎందుకు వెళ్లనివ్వలేదు?’‘చంద్రబాబు గారు స్వయంగా పూనుకుంటే తప్ప ప్రభుత్వం కళ్ళు తెరవదా?అంటూ ప్రశ్నించారు

‘శిబిరానికి వెళ్లిన పోలీసులు అక్కడ మా నేతలని అరెస్టు చేసి బాధితులను భయభ్రాంతులకు గురిచేశారు. మీరు మీ ఊళ్లకు వెళ్లిపోండి మేము భద్రత కల్పిస్తాము అంటున్నారు.

🔴శిబిరం ఇప్పుడే కనిపించిందా?:

వైకాపా ప్రభుత్వ బాధితుల శిబిరం పెట్టి 9 రోజులు అయినా ఇటువైపు కన్నెత్తి చూడని పోలీస్ అధికారులకు ఇప్పుడే శిబిరం కనిపించిందా?. మూడు నెలలుగా ఇవ్వలేని నమ్మకం, భద్రత బాధితులకి ఇప్పుడు ఎలా అందిస్తారో ముఖమంత్రిగారు, హోమ్ మంత్రిగారు, రాష్ట్ర డీజీపీ సవాంగ్ గారు తక్షణమే ప్రజలకు తెలియజేయాలి ” 👉ప్రజల భద్రత విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తే తెదేపా పోరాటం మరింత ఉధృతం చేస్తాం’అన్నారు లోకేష్ .


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights