OnePlus 15: ట్రిపుల్ 50MP కెమెరాతో వన్‌ప్లస్‌ నుంచి సరికొత్త ఫోన్‌.. వివరాలు లీక్‌..!

oneplus-15

OnePlus తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లలో పనితీరు, కెమెరా నాణ్యతపై ఎల్లప్పుడూ ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది. ఈసారి ఐఫోన్ 17 సిరీస్‌తో పోటీ పడటానికి కంపెనీ మరింత అధునాతన లక్షణాలను అందించడానికి సన్నాహాలు చేస్తోంది. అదే సమయంలో ఫోన్ 165Hz LTPO OLED డిస్‌ప్లే,.

ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ తర్వాత వన్‌ప్లస్ ఇప్పుడు దాని తదుపరి తరం ఫ్లాగ్‌షిప్, వన్‌ప్లస్ 15 ను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే రాబోయే ఫ్లాగ్‌షిప్ గురించి పెద్దగా సమాచాం లేకపోయినా ఇందుకు సంబంధించిన ఫీచర్స్‌, ఇతర వివరాలు లీక్‌ అయ్యాయి. అదే సమయంలో వన్‌ప్లస్ హాసెల్‌బ్లాడ్‌తో తన భాగస్వామ్యాన్ని ముగించింది. అంటే మనం కొత్త కెమెరా సెటప్‌ను అలాగే మెరుగైన స్పెసిఫికేషన్‌లను చూడవచ్చు. మీడియా నివేదికలను నమ్ముకుంటే, వన్‌ప్లస్ కెమెరా కోసం డిటైల్ మాక్స్ ఇంజిన్‌ను పరిచయం చేయనుంది.

OnePlus 15 ప్రస్తుత ఫ్లాగ్‌షిప్ పరికరాలు కలిగి ఉన్న 120Hz రిఫ్రెష్ రేట్‌ను మించి ఉంటుంది. నివేదికల ప్రకారం, ఈ ఫోన్‌ 165Hz డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది మునుపటి తరం కంటే పెద్ద అప్‌గ్రేడ్. OnePlus 13 లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో ప్యానెల్ ఉంది. 165Hz, 185Hz రిఫ్రెష్ రేట్‌లతో ASUS ROG ఫోన్ వంటి కొన్ని గేమింగ్ ఫోన్‌లు ఇంతకు ముందు కనిపించాయి. అలాగే OnePlus ఎంట్రీ ఫ్లాగ్‌షిప్ విభాగానికి కొత్త రూపాన్ని ఇవ్వగలదు. ఇక్కడ 120Hz రిఫ్రెష్ రేట్ ప్రమాణంగా పరిగణిస్తారు.

OnePlus 15 లాంచ్ టైమ్‌లైన్:

OnePlus 15 అక్టోబర్‌లో చైనాలో లాంచ్ కావచ్చు. వచ్చే ఏడాది జనవరిలో భారతీయ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. అయితే దీని గురించి ఇంకా పెద్దగా సమాచారం రాలేదు. ఈ ఫోన్‌ మూడు కలర్స్‌లో అందుబాులో ఉండనున్నట్లు తెలుస్తోంది.

OnePlus 15 స్పెసిఫికేషన్లు:

మీడియా నివేదికల ప్రకారం, ఈ ఫోన్‌ 165Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల ఫ్లాట్ LTPO OLED డిస్‌ప్లేతో రావచ్చు. అలాగే స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ 2 చిప్‌సెట్‌తో అమర్చవచ్చు. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 16లో రన్ అవుతుంది. అలాగే 7,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. అదే సమయంలో ఈ ఫోన్‌ 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP, 50MP అల్ట్రా వైడ్, 50MP టెలిఫోటో లెన్స్‌లను కలిగి ఉంటుంది.

OnePlus 15 కెమెరా నాణ్యత:

OnePlus తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లలో పనితీరు, కెమెరా నాణ్యతపై ఎల్లప్పుడూ ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది. ఈసారి ఐఫోన్ 17 సిరీస్‌తో పోటీ పడటానికి కంపెనీ మరింత అధునాతన లక్షణాలను అందించడానికి సన్నాహాలు చేస్తోంది. అదే సమయంలో ఫోన్ 165Hz LTPO OLED డిస్‌ప్లే, ట్రిపుల్ 50MP కెమెరా సెటప్, అల్ట్రా-ఫాస్ట్ చిప్‌సెట్‌ను పొందుతుందని భావిస్తున్నారు.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights