ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తే చర్యలు

0

*ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తే చర్యలు* *డీఈవోల ఆదేశం*

*2020-21 విద్యా సంవత్సరం ఇంకా ప్రారంభం కాలేదని వెల్లడి*

హైదరాబాద్‌: పాఠశాలలు తరగతి గది లేదా ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహించరాదని పలువురు జిల్లా విద్యాశాఖ అధికారులు శనివారం ఆదేశాలు జారీ చేశారు. ‘బడి’తెగింపు శీర్షికన ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైన నేపథ్యంలో డీఈవోలు ఈ ఆదేశాలిచ్చారు. 2020-21 విద్యా సంవత్సరానికి తరగతుల ప్రారంభంపై ప్రభుత్వం అనుమతి ఇవ్వనందున ఆన్‌లైన్‌ తరగతులు కూడా జరపరాదని, అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఖమ్మం, మేడ్చల్‌, వరంగల్‌ రూరల్‌ తదితర జిల్లాల డీఈవోలు ఆదేశాలు జారీ చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభం కానందున రుసుములు కూడా వసూలు చేయడానికి వీల్లేదని వారు స్పష్టంచేశారు. నిబంధనలు పాటించకుంటే ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని డీఈవోలు తెలిపారు.

Leave a Reply