భారతీయ సినిమాలకు ఇక ఆస్కార్ అవార్డ్స్ రాకపోవచ్చు : ఆస్కార్స్ అకాడమీ అధ్యక్షుడు జాన్ బ్రెయిలీ

0

శనివారం భారత్‌కు వచ్చిన ఆస్కార్స్‌ అకాడమీ అధ్యక్షుడు జాన్‌ బెయిలీ ముంబయిలో ఆస్కార్స్‌ అకాడమీకి సంబంధించిన ఓ కార్యాలయాన్ని ఏర్పాటుచేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా జాన్‌ మీడియాతో సమావేశమైన ఆయనకు ఒక ప్రశ్న ఎదురయ్యింది.

👉భారతీయ సినిమాలకు ఆస్కార్ అవార్డ్స్ ఎందుకు రావడం లేదు : ఈ ప్రశ్న పై జాన్‌ ఈ విధంగా మాట్లాడారు. నా అభిప్రాయంలో భారతీయ సినిమా ప్రపంచంలోనే గొప్పది. ఎందుకంటే భారత్‌ ఎన్నో సంప్రదాయాలు, సంస్కృతులకు పెట్టింది పేరు. కానీ మాకు బాలీవుడ్‌ నుంచి విడుదలయ్యే మ్యూజికల్‌ సినిమాల ద్వారానే భారతీయ చిత్రాల గురించి తెలిసింది. కానీ వాటిలో భారతీయ సంప్రదాయాలు, సంస్కృతులు, విలువల గురించి తెలిపే అంశాలేమీ కనిపించడంలేదు. నేను చెప్పదలచుకున్నది ఏంటంటే.. ”మాకు భారతీయ సినిమా గురించి ఏమీ తెలీదు”
అలా తెలీకపోవడంలో మా తప్పేమీ లేదు. ఎందుకంటే.. ప్రపంచానికి మీ విలువను తెలియజేసేలా సినిమాలను తెరకెక్కించాల్సిన బాధ్యత మీది (భారతీయ దర్శక, నిర్మాతలను ఉద్దేశిస్తూ). ప్రపంచంలో అలాంటి విలువలు ఉన్న సినిమాలకే ప్రాధాన్యం ఉందన్న విషయం మీరు గుర్తించాలి. అని జాన్‌ వెల్లడించారు .

Leave a Reply