పెట్టింది రూ.50 కోట్లు.. వచ్చింది రూ.177.96 కోట్లు.. భయంతో వణికిపోయిన ఆడియన్స్

ott-movie-2

చాలా మంది సినీ లవర్స్ హారర్ సినిమాలు చూడటానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఎంత భయంగా అనిపించినా కూడా కళ్లు మూసుకుంటూనే చూసేవారు చాలా మంది ఉంటారు. కానీ ఒంటరిగా చూడాలంటే మాత్రం భయమే. ఓటీటీల్లోనూ హారర్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది.

ఓటీటీలో ప్రతి శుక్రవారం రకరకాల సినిమాలు విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటుం ఉంటాయి. థియేటర్స్ లో కొత్త సినిమాలు సందడి చేస్తుంటే.. ప్రతి శుక్రవారం ఓటీటీల్లో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రకరకాల జోనర్స్ సినిమాలు విడుదలవుతున్నాయి. ప్రేక్షకులు ఏమాత్రం ఖాళీ దొరికినా కూడా ఓటీటీలో సినిమాలు చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. థియేటర్స్ లో విడుదలైన సినిమాలను ఓటీటీలో మళ్లీ మళ్లీ చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే ఇతర బాషల సినిమాలను కూడా ఓటీటీలో చూడటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇక సినీ లవర్ ఎక్కువగా ఇష్టపడే సినిమాల్లో హారర్ సినిమాలు ముందు వరసలో ఉంటాయి. ఇప్పటికే ఎన్నో రకాల హారర్ సినిమాలు ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. ఇక ఇప్పుడు ఓ హారర్ థ్రిల్లర్ సినిమా ఓటీటీని షేక్ చేస్తుంది. ఇప్పటివరకు చూడని విధంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అంతే కాదు భారీ బడ్జెట్ తో ఈ భయంకర సినిమాను రూపొందించారు.

ఈ సినిమాను ఏకంగా రూ.50 కోట్లతో నిర్మించారు. అలాగే భారీగా వసూల్ చేసింది ఆ సినిమా.. ఇంతకూ ఈ హారర్ సినిమాలో ఏముందంటే.. ఈ చిత్రం ఇద్దరు యువ మోర్మన్ మిషనరీలు, సిస్టర్ బర్న్స్ (సోఫీ థాచర్), సిస్టర్ పైక్ (క్లోయ్ ఈస్ట్), చుట్టూ తిరుగుతుంది. ఈ ఇద్దరూ తమ మత సందేశాన్ని పంచుకోవడానికి ఇంటింటికీ తిరుగుతూ ఉంటారు. ఒక రోజు, వారు మిస్టర్ రీడ్ (హ్యూ గ్రాంట్) అనే  మేధావి వ్యక్తి ఇంటికి వెళ్తారు. అతను మతం గురించి చర్చించడానికి ఆసక్తి చూపిస్తాడు, కానీ అంతలోనే అతని నిజస్వరూపం బయటపడుతుంది. మిస్టర్ రీడ్ ఒక మతోన్మాది, మానసిక వక్రబుద్ధి కలిగిన వ్యక్తి అని తేలుతుంది. అతను ఆ యువతులను తన ఇంటిలో బందీలుగా చేస్తాడు. అతను వారిని ఒక భయానక మత ప్రయోగంలో భాగం చేస్తాడు.

ఇందులో వారి విశ్వాసాలను పరీక్షించే ఒక భయంకరమైన ఆటను ఆడమని బలవంతం చేస్తాడు. ఈ ఆటలో వారు సరైన “విశ్వాసాన్ని” ఎంచుకోవాలి, లేకపోతే మరణం తప్పదు. ఈ ప్రక్రియలో, మిస్టర్ రీడ్ మతం, విశ్వాసం, నీతి గురించి వక్రీకరించిన తాత్విక వాదనలను చేస్తుంటాడు. ఈ చిత్రం భయానకంతో పాటు మత విశ్వాసాలు, మానసిక హింస,  మానవ మనస్తత్వంలోని చీకటి కోణాలను చూపిస్తుంది. ఈ సినిమాలోని ప్రతి సీన్ ఎంతో భయంకరంగా ఉంటుంది. సీన్ సీన్ కు నెక్ట్స్ ఏం జరుగుతుందా అని ఉత్కంఠగా ఎదురుచూడాల్సిందే.. ఈ సినిమాలో అన్ని సన్నివేశాలు కంప్లీట్‌ హారర్‌ ఎక్స్‌పీరియన్స్‌ ను అందిస్తాయి. రూ.50 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన హెరెటిక్ బాక్సాఫీస్ వద్ద రూ.177.96 కోట్లు సంపాదించింది. ఈ హారర్ సినిమా ఇప్పుడు ఓటీటీలో అదరగడుతుంది. ఈ సినిమా మ్యాక్స్‌లో అందుబాటులో ఉంది.ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వకండి.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights