మంచుకొండల్లో కలవరం.. ముందే గుర్తించే పరికరం
*భూకంపలేఖినిలతో ముందస్తు హెచ్చరికలు* *ఉత్పాతాలపై అత్యంత కచ్చితత్వంతో సమాచారం* *దేశంలోనే తొలిసారి అభివృద్ధి చేసిన ఎన్‌జీఆర్‌ఐ* *‘ఈనాడు’తో సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పూర్ణచంద్రరావు* హైదరాబాద్: హిమాలయాల్లో కొండచరియలు విరిగిపడి భారీ ప్రమాదాలు జరుగుతున్నాయి. భూతాపంతో మంచు కొండలు కరుగుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్‌లో శిఖరాలపై మంచు కరిగి హఠాత్తుగా వరదలు పోటెత్తడంతో వంద మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రతి రెండు మూడేళ్లకు ఇలాంటి ఉత్పాతాలు హిమాలయాల్లో సంభవిస్తున్నాయి. ఇప్పటివరకు ముందస్తు హెచ్చరిక వ్యవస్థ లేకపోవడంతో…