
Warangal Chapata Chilli: వరంగల్ మిర్చికి అరుదైన ఘనత.. చపాటకు జీఐ ట్యాగ్..స్పెషల్ ఏంటంటే..
ఈ మిర్చికి ప్రత్యేకతలు ఉండటం వల్ల GI గుర్తింపు లభించిందని.. కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సటీ వీసీ దండా రాజిరెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ నుంచి ధ్రువీకరణ పత్రం అందిందని ఆయన వెల్లడించారు. వరంగల్ చపాటా మిర్చికి GI గుర్తింపు లభించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఓరుగల్లు పేరు మరోమారు ప్రత్యేకంగా వార్తల్లో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఆహారపు వ్యవసాయ ఉత్పత్తులు జాబితాలో ప్రత్యేక స్థానం దక్కించుకుంది ఓరుగల్లు చిల్లీ..వరంగల్ చపాటా…