UNలో పాక్ ప్రధానికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన భారత్! ఒసామా బిన్ లాడెన్ ప్రస్తావనతో..

ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని కీర్తిస్తోందని, ఒసామా బిన్ లాడెన్‌కు ఆశ్రయం కల్పించిందని భారత్ పేర్కొంది. ఐరాసలో భారత కార్యదర్శి పెటల్ గహ్లోట్, పాక్ ద్వంద్వ వైఖరిని, ఉగ్రవాద సంస్థలకు మద్దతును ఆధారాలతో సహా ఎండగట్టారు.
ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా విమర్శించింది. పాకిస్థాన్ మరోసారి ఉగ్రవాదాన్ని కీర్తిస్తోందని ఆరోపించింది. తన ప్రత్యుత్తర హక్కును వినియోగించుకుంటూ ఐక్యరాజ్యసమితిలో భారతదేశ శాశ్వత మిషన్‌లో మొదటి కార్యదర్శి పెటల్ గహ్లోట్, పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం, రెసిస్టెన్స్ ఫ్రంట్ వంటి గ్రూపులను జవాబుదారీతనం నుండి రక్షించడం, ఉగ్రవాదంతో పోరాడుతున్నట్లు చెప్పుకుంటూ ఒక దశాబ్దం పాటు ఒసామా బిన్ లాడెన్‌కు ఆశ్రయం కల్పించడం వంటి విషయాలను ప్రస్తావిస్తూ పాకిస్థాన్‌ను కడిగిపారేశారు.
“మిస్టర్ ప్రెసిడెంట్, ఈ సభలో ఉదయం పాకిస్తాన్ ప్రధాన మంత్రి అసంబద్ధమైన నాటకీయ ప్రదర్శనలు ఇచ్చారు. ఆయన మరోసారి తమ విదేశాంగ విధానానికి కేంద్రంగా ఉన్న ఉగ్రవాదాన్ని కీర్తించారు. అయితే ఎంత నాటకీయత ఉన్నా, ఎన్ని అబద్ధాలు చెప్పినా వాస్తవాలను దాచలేరు” అని గహ్లోట్ అన్నారు.
2025 ఏప్రిల్ 25న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో జరిగిన సమావేశంలో జమ్మూ కశ్మీర్‌లో పర్యాటకుల ఊచకోతకు పాకిస్తాన్ మద్దతు ఉన్న ఉగ్రవాద సంస్థ అయిన రెసిస్టెన్స్ ఫ్రంట్‌ను పాకిస్తాన్ బాధ్యత నుండి కాపాడిందని ఆమె ఫోరమ్‌కు గుర్తు చేశారు. పాకిస్తాన్ చాలా కాలంగా ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేయడంలో నిమగ్నమై ఉందని, ఉగ్రవాదంపై యుద్ధంలో భాగస్వామిగా నటిస్తూ ఒసామా బిన్ లాడెన్‌కు ఆశ్రయం ఇచ్చిన చరిత్ర కలిగి ఉందని గహ్లోట్ నొక్కిచెప్పారు. “మిస్టర్ ప్రెసిడెంట్, ఉగ్రవాదాన్ని పెంచిపోషించడంలో చాలా కాలంగా మునిగిపోయిన దేశం అందుకోసం అత్యంత హాస్యాస్పదమైన కథనాలను ముందుకు తీసుకురావడంలో సిగ్గుపడదు.
అది ఒక దశాబ్దం పాటు ఒసామా బిన్ లాడెన్‌కు ఆశ్రయం కల్పించిందని గుర్తుంచుకోవాలి, ఉగ్రవాదంపై యుద్ధంలో భాగస్వామిగా నటిస్తూనే, ఆ దేశ మంత్రులు ఇటీవలే తాము దశాబ్దాలుగా ఉగ్రవాద శిబిరాలను నిర్వహిస్తున్నామని అంగీకరించారు. ఈసారి దేశ ప్రధాన మంత్రి స్థాయిలో ఈ ద్వంద్వత్వం మరోసారి కొనసాగడంలో ఆశ్చర్యం లేదు” అని గహ్లోట్ అన్నారు. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో ఏడు భారతీయ జెట్‌లకు నష్టం వాటిల్లిందని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన వాదనను భారత్ ఖండించింది. బహవల్‌పూర్, మురిద్కే ఉగ్రవాద సముదాయాల చిత్రాలు ఆపరేషన్ సిందూర్‌లో భారత దళాలు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు చూపిస్తున్నాయని గహ్లోట్ తెలిపారు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
