త్వరలో..మీ పాస్ పోర్ట్ లు..మారబోతున్నాయ్..!!

passport

Teluguwonders: ఇకపై పాస్‌పోర్టులకు మరిన్ని భద్రతా ప్రమాణాలు జోడించి చిప్‌ ఆధారిత ఈ – పాస్‌పోర్ట్‌ జారీ చేయబోతున్నట్టు ప్రభుత్వం తెలిపింది .
త్వరలో పాస్‌పోర్టుల్లో ఎలక్ట్రానిక్ చిప్స్ తీసుకురావాలని ప్రభుత్వం అనుకుంటోంది.

📌E- పాస్‌పోర్ట్‌ అంటే :
ప్రస్తుతం ఇస్తున్న పాస్ పోర్టులను 2013వ సంవత్సరం నుంచి గోస్ట్ ఇమేజ్‌(డిజిటల్ ఫొటో)తో అందిస్తున్నారు. అయితే వాటి స్థానంలో చిప్స్ వస్తాయి.
👉ఈ చిప్‌లో పర్టికులర్ వ్యక్తి యొక్క బర్త్ డే, తల్లిదండ్రుల పేర్లు, పూర్తి చిరునామా, ఫొటోలతో కూడిన పూర్తి సమాచారం ఉంటుంది. ఎవరైనా ఫొటో మార్చాలని ప్రయత్నించినా వేరే ఏ ఇతర మోసాలకు పాల్పడేందుకు యత్నించినా పాస్ పోర్టు ఆఫీస్‌కు మెసేజ్ వెళ్లిపోతుంది. (NIC), ఐఐటీ-కాన్పూర్ సంయుక్తంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌తో ఇ-పాస్‌పోర్ట్స్ జారీ చేస్తారు. ఇ-పాస్‌పోర్ట్స్ తయారీ కోసం కావాల్సిన ఎలక్ట్రానిక్ కాంటాక్ట్‌లెస్ ఇన్‌లేస్ సేకరించేందుకు నాసిక్‌లోని ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్‌కు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.మొదటిసారిగా US గవర్నెమెంట్ ల్యాబరేటరీ లో టెస్టులు జరిగాయి.

📌ఈ – పాస్‌పోర్ట్‌ ఫీచర్స్ :

ఈ – Passports మందంగా ,ముందు మరియు వెనుక కవర్లు కలిగి ఉంటుంది. వెనుక కవర్లో ఒక చిన్న సిలికాన్ చిప్ ను కలిగి ఉంటుంది, తపాలా బిళ్ళ కంటే చిన్నదిగా ఉంటుంది, అంతేకాక antenna ని కలిగి ఉంటుంది.

📌చదవడానికి కొన్ని సెకన్ల సమయం పడుతుంది :

ముఖ్యమైన అదనపు సెకన్లు ఇమ్మిగ్రేషన్ కౌంటర్లలో సేవ్ చేయబడతాయి.
చదవడానికి కొన్ని సెకన్ల సమయం పడుతుంది.

👉ఇందులో ఏ ప్రైవేట్ ఏజెన్సీ జోక్యం చేసుకోలేదు. ఈ సాఫ్ట్‌వేర్‌ ను IIT-Kanpur మరియు National Informatics Center డెవలప్ చేసింది.

📌 మెమరీ స్పేస్ :

చిప్ యొక్క మెమరీ స్పేస్ 64 కిలోబైట్లు. 30 విజిట్స్ సమాచారం మరియు ఇంటర్నేషనల్ మూమెంట్స్ సేవ్ చేయబడతాయి.

👉Extra features :

ఫోటోగ్రాఫ్ మరియు ఫింగర్ ప్రింట్స్ ని కూడా సేవ్ చేయడం దీని అదనపు ప్రత్యేకత.

🔴భద్రతా విషయాల రీత్యా : చిప్ బేస్డ్ పాస్ పోర్టు భద్రతా విషయాల రీత్యా కీలకంగా వ్యవహరిస్తాయి.

👉 ఇష్యూ చేయడానికి తీసుకునే సమయం :

రెగ్యూలర్ పాస్‌పోర్టులు ఇష్యూ చేయడానికి ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయం నాలుగు నుంచి ఐదు రోజుల సమయం తీసుకుంటుంది. ఈ పాస్ పోర్టులు కూడా అంతే సమయంలోగా వినియోగదారుల చేతికి అందిస్తారు. ఇవి వస్డే మాత్రం చిప్‌తో డేటా మొత్తం క్లుప్తీకరించి ఇవ్వనున్నారు. పాస్ పోర్టులు డిమాండ్ చేస్తున్న ప్రధాన నగరాల్లో హైదరాబాద్ ముఖ్యమైనది.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights