పవన్ కళ్యాణ్ గురువు షిహాన్ హుస్సేనీ మృతి.

పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్ట్స్, కరాటేలో ప్రావీణ్యం సాధించిన సంగతి తెలిసిందే. కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా సంపాదించాడు. అయితే దీనంతటికి కారణమైన గురువు షిహాన్ హుస్సేన్ గురించి చాలా మందికి తెలియదు. ప్రస్తుతం ఆ గరువు కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఆయన మంగళవారం నాడు కన్నుమూశారు. గతంలో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఎంతలా కష్టపడి నేర్చుకున్నాడో ఆయన గతంలో ఓ ఇంటర్వ్యూలో వివరించాడు.
హైలైట్:
- కరాటే మాస్టర్ కన్నుమూత
- షిహాన్ హుస్సేనీ మరణం
- పవన్ కళ్యాణ్‌కు కరాటే నేర్పిన గురువు
కరాటేలో నిపుణుడైన హుస్సేనీ.. 90వ దశకంలో పవన్ కళ్యాణ్‌కు విద్యను నేర్పించాడు. ఆ టైంలో అసలు ఇక కరాటే శిక్షణ ఎవ్వరికీ ఇవ్వొద్దని హుస్సేనీ అనుకున్నారట. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం రోజూ వచ్చి వెళ్తుండేవాడట. ఇక పవన్ కళ్యాణ్ పట్టుదల చూసి హుస్సేనీ కరాటేని నేర్పించాడట. ఓ ఏడాది పాటుగా తనతోనే ఉన్నాడని హుస్సేనీ చెప్పుకొచ్చాడు. ఇంట్లోనే ఉండి టీ కూడా అందించేవాడని, ఇంటిని కూడా శుభ్రం చేసేవాడని తెలిపాడు.
అయితే మొదట్లో పవన్ కళ్యాణ్ తాను చిరంజీవి తమ్ముడని చెప్పలేదట. హుస్సేనీకి కూడా ఆ విషయం తెలియదట. ఓ మూడు, నాలుగు నెలల తరువాత ఆ విషయాన్ని చెప్పాడట. ఓ సామాన్యుడిలా వచ్చి.. విద్యను నేర్చుకుని, తన ప్రతిభను చాటుకోవాలని అనుకున్నాను అని పవన్ కళ్యాణ్ అన్నాడట. అలా ఆ నాటి రోజుల్ని హుస్సేనీ తలుచుకుంటూ గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఆయన క్యాన్సర్‌తో గత కొంత కాలంగా పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఇక ఆయన తన శరీరాన్ని కూడా రీసెర్చ్ కోసం దానం చేశారని తెలుస్తోంది. హుస్సేనీ నటుడిగా ఎక్కువ చిత్రాల్లో నటించలేదు కానీ.. తన ఫోకస్ అంతా కూడా కరాటే, ఆర్చరీ, మార్శల్ ఆర్ట్స్ వంటి వాటి మీదే ఉండేదని తెలుస్తోంది. మరి తన గురువు హుస్సేనీ మరణం మీద పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఇప్పటికి అయితే కోలీవుడ్ సెలెబ్రిటీలు హుస్సేనీ మరణంపై సంతాపం ప్రకటిస్తున్నారు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
