ఢిల్లీ ఫలితాలు : మాములోడివి కాదయ్యా పీకే ! నిన్న జగన్ నేడు క్రేజీవాల్

163120259301cea19ff302b70761749c5ca94546a.jpg

తమ రాజకీయ ప్రత్యర్ధులను ఊడ్చి పారేసే దిశగా చీపురు పార్టీ తమ సత్తాను చాటుకుంటు ముందుకు వెళ్తోంది. వార్ వన్ సైడ్ అన్నట్లుగా ఫలితాలు క్రేజివాల్ పార్టీకి వస్తుండడంతో రాజకీయ ప్రత్యర్థులు అప్పుడే ఢీలా పడిపోయారు. ఢిల్లీ ప్రజలకు ఏ విధమైన పరిపాలన అందించాలి..? ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఏంటి అనే విషయంపై మొదటి నుంచి దృష్టి పెట్టిన క్రేజీవాల్ అనుకున్న విధంగానే ఫలితాలను సాధించడం దాదాపు ఫిక్స్ అయిపోయింది. అధికార పార్టీ బిజెపి హవాను తట్టుకుని బీజేపీ అగ్ర నాయకులు అందరూ ఉండే ఢిల్లీలో సత్తా చాటడం అంటే మామూలు విషయం కాదు.


ఇంతటి ఘన విజయం క్రేజీవాల్ సాధించడం క్రేజివాల్ ఒక్కడి వల్ల కానీ పని. ఆయన వెనుక ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్త పని చేయడం వల్ల ఇంతటి మెరుగైన ఫలితాలు సాధించే దిశగా ఆ పార్టీ ముందుకు వెళ్తోంది.

లోక్ సభ ఎన్నికల్లో మొత్తం ఏడు స్థానాలు బిజెపి దక్కించుకోవడం తో ఆమ్ ఆద్మీ పార్టీ కి ప్రజల్లో ఆదరణ లేదని విషయం చాలామంది హైలెట్ చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయని భావించగా… ఇప్పుడు ఫలితాలు తారుమారయ్యాయి.

ఇక్కడే ప్రశాంత్ కిషోర్ వ్యూహం గట్టిగా పని చేసినట్లు అర్థం అవుతోంది. క్రేజీ వాల్ కోసం రంగంలోకి దిగిన ప్రశాంత్ కిషోర్ గెలుపు కోసం గట్టిగా కృషి చేశారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం తో పాటు అనేక పథకాల రూపకల్పనకు పీకే సహాయం అందించారు. అలాగే జాతీయవాదాన్ని తెరమీదకు తీసుకు వచ్చే లా పార్టీ నాయకులు ఎవరు ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని సీరియస్ గా చెప్పడం ఇవన్నీ ఆ పార్టీకి కలిసి వచ్చాయి. అది కాకుండా అభ్యర్థులందరికీ పీకే తనదైన శైలిలో స్పెషల్ గా క్లాస్ లు తీసుకుని మరి సలహాలు సూచనలు అందించారు.

ఈ సూచనలతోనే ఆ పార్టీకి తిరుగులేని ఫలితాలను అందించినట్టు గా అర్థం అవుతోంది. ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడేందుకు ప్రశాంత్ కిషోర్ ఎటువంటి వ్యూహరచన చేశాడో అదేవిధంగా ఢిల్లీ ఎన్నికలలో క్రేజీవాల్ పార్టీకి పనిచేసి ఆయన మరోసారి తన సత్తా చాటుకోబోతున్నారు. ఏపీలో జగన్ ప్రభుత్వం ఏవిధంగా అయితే ఎవరూ ఊహించని ఫలితాలను సాధించిందో అదేవిధంగా ఢిల్లీలో సాధించే దిశగా అడుగులు వేయడం ప్రశాంత్ కిషోర్ సామర్థ్యాన్ని తెలియజేస్తుంది.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading