హైకోర్టు ఆదేశాలను పక్కనపెట్టి పోలవరం రీ టెండరింగ్

Polavaram Re-Tendering

Teluguwonders:

హైకోర్టు ఆదేశాలను పక్కనబెట్టి పోలవరం విషయంలో జగన్ ముందుకెళ్తున్నారు.పోలవరం ప్రాజెక్టు నుంచి నవయుగ సంస్థను తప్పిస్తూ వారి స్థానంలో కొత్త టెండర్లకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది

వివరాల్లోకి వెళ్తే :

💥పోలవరం ప్రాజెక్టు టెండర్లకు నోటిఫికేషన్ విడుదల :

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీటెండరింగ్‌కు వెళ్లాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ అంశంలో హైకోర్టు ఆదేశాలను సైతం పక్కనబెట్టిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం.. టెండర్లకు నోటిఫికేషన్ విడుదల చేసింది. డ్యామ్‌ పనులు, హైడల్ పవర్ ప్రాజెక్టు పనులకు సంబంధించి రూ.4987.55 కోట్లకు నోటిఫికేషన్ జారీచేసింది.

🔴గడువు పెంచేందుకు అవకాశం లేదు :

ఈ సందర్భంగా మరో మూడు వారాలపాటు టెండర్లకు గడువు పెంచాలని జలవనరులశాఖ చీఫ్‌ ఇంజినీర్‌ను వారు కోరారు.

అయితే, టెండర్ల ప్రక్రియ ఇప్పటికే ఆలస్యమైందని గడువు పెంచేందుకు అవకాశం లేదని అధికారులు స్పష్టం చేశారు. టెండర్‌లో పేర్కొనని కొత్త పనులు ఉంటే వాటికి తాజా ఎస్‌ఎస్‌ఆర్‌ వర్తింపజేస్తారా అని కంపెనీల తరఫున హాజరైన ప్రతినిధులు ప్రశ్నించగా ఆ అవకాశం లేదని స్పష్టం చేశారు. ఇసుక ఉచితంగా సరఫరా చేసే విషయంలోనూ పలు సందేహాలను వ్యక్తం చేశారు.

🔴వెలుగొండ ప్రాజెక్టు పనుల నుంచి :

వెలుగొండ ప్రాజెక్టు రెండో సొరంగం తవ్వకం పనుల నుంచి రిత్విక్‌ సంస్థను ప్రభుత్వం తప్పించినట్టు ఈఈ తెలిపారు. టెండర్ దక్కించుకున్న తర్వాత 25 శాతం పనులు కూడా పూర్తి చేయకపోవడంతో నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఈ పనులకు త్వరలో మళ్లీ టెండర్లు పిలుస్తారన్నారు
👉మరోవైపు, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి సంబంధించి అదనపు ధరలు వర్తింపజేసేందుకు వీలుగా ఎంఎస్‌ ప్లేట్స్‌ గ్రేడ్‌ 275బీఆర్‌ ధరలను నిర్ణయిస్తూ ఆర్‌ అండ్ బీ శాఖ ఉత్తర్వులిచ్చింది. ఈ275బీఆర్‌ గ్రేడ్‌ ఎంఎస్‌ ప్లేటు ధరను మెట్రిక్‌ టన్నుకు కనిష్ఠంగా రూ.45,927 నుంచి గరిష్ఠంగా రూ.49635 వరకు నిర్ధారించింది.
జలవనరులశాఖ టెండర్లు ఆహ్వానించి నిర్వహించిన ప్రీ బిడ్‌ సమావేశానికి 8 కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఇందులో మేఘా ఇంజినీరింగ్‌, పటేల్‌, రుత్విక్‌, భెల్‌, ఆఫ్గాన్స్‌, చైనాకు చెందిన షెంగాయ్‌ తదితర సంస్థల ప్రతినిధులు ఉన్నారు.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights