Post Office Scheme: ఈ పోస్టాఫీస్ పథకం పిల్లలకు ఒక వరం..18 ఏళ్ల తర్వాత బంపర్ రాబడి

పోస్ట్ ఆఫీస్ RD పథకాన్ని మంచి పెట్టుబడి ఎంపికగా పరిగణిస్తారు. కేవలం రూ. 100 డిపాజిట్‌తో ఖాతాను తెరవవచ్చు. గరిష్ట డిపాజిట్ పరిమితి లేదు. 10 ఏళ్లు పైబడిన మైనర్లకు వారి తల్లిదండ్రులు ఖాతాను తెరవవచ్చు. 18 ఏళ్లు నిండిన తర్వాత.. వారు కొత్త KYC ఫారమ్‌ను పూర్తి చేయాలి.
నేటి ఆర్థిక యుగంలో ప్రతి ఒక్కరూ జీవితం సుఖంగా సంతోషంగా సాగిపోవాలంటే.. భారీ మొత్తంలో డబ్బు సంపాదించాలని కోరుకుంటారు. అయితే మధ్య తరగతి, సామాన్యులు చిన్న చిన్న చిన్న మొత్తాలను ఆదా చేసి భారీ మొత్తాన్ని పొందాలని భావిస్తారు. మీరు కూడా మీ ఆర్ధిక పరిస్తితిని అలా నిర్మించుకోవాలనుకుంటే.. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ (RD) పథకం మంచి ఎంపిక అని చెప్పవచ్చు. దీనినిలో ఉన్న వివిధ పథకాలు ప్రయోజనకరం. మీ మూలధనాన్ని ఒకేసారి బ్లాక్ చేయాల్సిన అవసరం ఉండదు.
రికరింగ్ డిపాజిట్‌లో మ్యూచువల్ ఫండ్ SIP లాగా ప్రతి నెలా చిన్న మొత్తాలను డిపాజిట్ చేయవచ్చు. పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ ఖాతాను తెరవడానికి కూడా సౌకర్యాన్ని అందిస్తుంది. రికరింగ్ డిపాజిట్‌పై వడ్డీ కూడా FD లాగానే ఉంటుంది. ఇది దీర్ఘకాలిక పెట్టుబడిని కూడా ప్రోత్సహిస్తుంది.
ఈ పథకం 6.7 శాతం వార్షిక రాబడిని అందిస్తుంది. ఇది చక్రవడ్డీని అందిస్తుంది. అంటే మీరు వడ్డీపై వడ్డీని పొందుతారు. కనుక మీరు ఈ పథకంలో వరుసగా ఐదు సంవత్సరాలు నెలకు రూ. 5,000 ను డిపాజిట్ చేస్తూ వెళ్తే.. మీరు ఈ పతకంలో మొత్తం రూ. 3 లక్షలు పెట్టుబడి పెడతారు. ఈ స్కీమ్ మెచ్యూర్ అయిన తర్వాత అంటే ఐదేళ్ళకు మొత్తం రూ. 356,830 అందుకుంటారు. అంటే మీరు దాచుకున్న రూ. 3 లక్షలతో పాటు వడ్డీగా రూ. 56,830 లాభం పొందుతారు.
పోస్ట్ ఆఫీస్ RD పథకం అంటే ఏమిటంటే..
పోస్ట్ ఆఫీస్ RD పథకాన్ని మంచి పెట్టుబడి ఎంపికగా పరిగణిస్తారు. కేవలం రూ. 100 డిపాజిట్‌తో ఖాతాను తెరవవచ్చు. గరిష్ట డిపాజిట్ పరిమితి లేదు. 10 ఏళ్లు పైబడిన మైనర్లకు వారి తల్లిదండ్రులు ఖాతాను తెరవవచ్చు. 18 ఏళ్లు నిండిన తర్వాత.. వారు కొత్త KYC ఫారమ్‌ను పూర్తి చేయాలి.
అయితే పోస్ట్ ఆఫీస్ RD కి 5 సంవత్సరాల కాలపరిమితి ఉంది. అంటే మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం కోసం కనీసం ఐదు సంవత్సరాలు వేచి ఉండడం వలన మంచి లాభాలను అందుకుంటారు. అవసరం అనుకుంటే మీరు ఖాతాను తెరిచిన మూడు సంవత్సరాల తర్వాత మూసివేయవచ్చు. ఖాతాదారుడు మరణిస్తే.. నామినీ ఆదాయాన్ని క్లెయిమ్ చేయవచ్చు లేదా ఖాతాను కొనసాగించవచ్చు. మీరు మొబైల్ బ్యాంకింగ్ లేదా ఇ-బ్యాంకింగ్ ద్వారా కూడా ఈ ఖాతాను తెరవవచ్చు. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్లు 6.7% స్థిర రాబడిని అందిస్తుంది. మీరు ఈ పథకంలో రూ. 100 వరకు మాత్రమే పెట్టుబడి పెట్టవచ్చు. అయితే.. రూ. 1.7 మిలియన్ల కార్పస్‌ను సేకరించడానికి..రోజుకు రూ. 333 పెట్టుబడి పెట్టాలి. అంటే నెలకు సుమారు రూ. 10,000. మీరు నెలకు రూ. 10,000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు కొన్ని సంవత్సరాలలో రూ. 1.7 మిలియన్ల కార్పస్‌ను సులభంగా సేకరించవచ్చు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
