గ్రేట్ డైరెక్టర్ అయిపోతాడు :: ప్రభాస్

Prabhas says Sujith becomes great director

Teluguwonders:

రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ పండగలాంటి వాతావరణంలో గడుపుతున్నారు .భారీగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుక వాళ్ళ కళ్ళ ముందు ఇంకా కదులుతూనే ఉంది. భారత సినీ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ‘సాహో’ ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో ఆదివారం రాత్రి నిర్వహించారు. ఇది ఇండియాలోనే అతిపెద్ద ప్రీ రిలీజ్ వేడుకని యాంకర్ సుమ వెల్లడించారు. ఇంత పెద్ద వేడుకకు అతిథులు కూడా అదే స్థాయిలో విచ్చేశారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, డైరెక్టర్ వి.వి.వినాయక్, టాలీవుడ్ బడా నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, ‘మల్లెమాల’ అధినేత శ్యామ్ ప్రసాద్ రెడ్డి తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
కార్యక్రమంలో చివరిగా అభిమానులను ఉద్దేశించి ప్రభాస్ మాట్లాడారు. ‘‘హాయ్ డార్లింగ్స్.. ఐ లవ్ యు’’ అంటూ అభిమానులను ఉర్రూతలూగించారు. ఈ సందర్భంగా ప్రభాస్ చాలా తక్కువ విషయాలే మాట్లాడినా.. దర్శకుడు సుజీత్‌పై మాత్రం ప్రశంసల వర్షం కురిపించారు. సుజీత్‌పై తనకున్న ఇష్టం, నమ్మకాన్ని చాటుకున్నారు. తన సినిమాలో చేయడానికి అంగీకరించిన తారలు, సీనియర్ టెక్నీషియన్స్ అందరికీ ఈ సందర్భంగా పేరుపేరున థ్యాంక్స్ చెప్పారు. వేడుకలో పాల్గొన్న చంకీ పాండే, అరుణ్ విజయ్‌, శ్రద్ధా కపూర్‌తో పాటు హాజరుకాని జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముకేశ్, లాల్ తదితరులందరికీ ప్రభాస్ కృతజ్ఞతలు తెలిపారు.

🔴దర్శకుడు సుజీత్ గురించి హీరో ప్రభాస్:

‘సాహో’ దర్శకుడు సుజీత్‌పై హీరో ప్రభాస్ ప్రశంసల వర్షం కురిపించారు. సుజీత్ తొలి సినిమా ‘రన్ రాజా రన్’ తీసేటప్పటికి ఆయన వయసు 22 ఏళ్లని ప్రభాస్ చెప్పారు.

‘సాహో’ ప్రీ రిలీజ్ వేడుకలో చిత్ర యూనిట్ సుజీత్ గురించి మాట్లాడుతూ.. ‘‘సుజీత్ నాకు కథ చెప్పడానికి నిక్కరేసుకుని వచ్చాడు. అప్పుడు అతని వయసు 24 సంవత్సరాలు. యూవీ క్రియేషన్స్‌లోనే ‘రన్ రాజా రన్’ చేశాడు. ఆ సినిమా చేసేటప్పటికి అతని వయసు 22 ఏళ్లు. సుజీత్ దగ్గర ఒక కథ ఉంది.. మేం విన్నాం నచ్చింది.. నువ్వు విను అని ప్రమోద్, వంశీ నాకు చెప్పారు. అప్పటికే సుజీత్ నాకు బాగా తెలుసు. వచ్చి కథ చెప్పాడు. కథేమో ఒక 40 ఏళ్ల వ్యక్తిలా చెప్పాడు.. కానీ నిక్కరేసుకుని వచ్చాడు. కథ చెప్పడం అయిపోయింది.. సినిమా ఒక స్థాయిలో అనుకున్నాం.. కానీ, యూవీ ఎప్పటిలానే దీన్ని మరింత పెద్ద సినిమా చేసేసింది.

🔴గ్రేట్ డైరెక్టర్ అయిపోతాడేమోనని డౌట్ నాకు:

ఒక సినిమా మీద నాలుగేళ్లు కూర్చొని ఇంత గొప్పగా చేయడం జోక్ కాదు. సుజీత్ కచ్చితంగా గొప్ప దర్శకుల్లో ఒకడవుతాడు. షూటింగ్ ప్రారంభం కావడానికి సంవత్సరం ముందునుంచే సుజీత్ వర్క్ మొదలుపెట్టాడు. పెద్ద పెద్ద టెక్నీషియన్స్ అందరినీ కలిశాడు. షూటింగ్ ప్రారంభమైంది. అందరూ పెద్దోళ్లే. సాబు సార్, మది సార్, కమల్ సార్, శేఖర్ సార్.. వీళ్లందరినీ ఎలా హ్యాండిల్ చేస్తాడా అని ప్రమోద్, వంశీ మేమందరం చాలా కంగారుపడ్డాం. కానీ, ఒక్కరోజు కూడా కోపమనేది లేకుండా పనిచేశాడు. ఇంత మందిని హ్యాండిల్ చేసిన విధానానికే సుజీత్ గ్రేటెస్ట్ డైరెక్టర్ అయిపోతాడేమోనని డౌట్ నాకు. ’’ అని సుజీత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights