Rain Alert: మరో మూడు రోజులు.. తెలుగు రాష్ట్రాలకు అతిభారీ రెయిన్ అలెర్ట్.. ముఖ్యంగా ఈ జిల్లాలకు

టూ స్టేట్స్. సైక్లోన్ అలర్ట్. వాయుగుండం తీరందాటాక ఏపీలో వర్షాలు కుమ్మేస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు పొంగిపొర్లుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో బీ అలర్ట్ అంటూ రెయిన్‌వార్నింగ్ ఇచ్చింది వాతావరణశాఖ. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి స్టోరీపై లుక్కేయండి మరి.
అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దండయాత్ర చేస్తున్నాయ్. తెలంగాణలో ఐదు రోజులు, ఏపీలో మరో మూడ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాల అలర్ట్ ఇచ్చారు వాతావరణశాఖ అధికారులు. తెలంగాణలోని భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం.. మహబూబాబాద్ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేయగా.. ఆదిలాబాద్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్.. అలాగే మరో 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. వాయుగుండం పశ్చిమ, వాయువ్య దిశలో కదిలి క్రమేపీ బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రేపు తెలంగాణలోని కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు.. ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
అటు ఏపీలో అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రమంతటా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయ్. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం.. అల్లూరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడనున్నాయ్. ప్రధాన పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగించారు. ఉత్తరాంధ్ర, యానాంలో మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు.. రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చని సూచించారు. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలపై వాతావరణశాఖ హెచ్చరికలు చేసింది.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
