Rama Navami: రామ నవమి రోజున అయోధ్యలో గొప్ప కార్యక్రమాలు.. భక్తుల కోసం ప్రత్యేక సదుపాయాలు..

navami-celebration-in-ayodhya

శ్రీ రామ నవమి పండగను అయోధ్యలో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు శర వేగంగా జరుగుతున్నాయి. గర్భ గుడిలో బాల రామయ్య కొలువు దీరిన తర్వత రామ నామ వేడుకలు రెండో ఏడాది కూడా ఘనంగా నిర్వహిస్తున్నట్లు శ్రీరామ మందిర్ ట్రస్ట్ ప్రకటించింది. ఈ వేడుకలకు సంబంధించిన రామాలయ అభిషేకం, సూర్యతిలకం, 56 నైవేద్యాలతో సహా వివరణాత్మక కార్యక్రమాన్ని విడుదల చేసింది. భక్తుల సౌకర్యార్థం చల్లటి నీరు, క్యూ నిర్వహణ, శీతలీకరణ ఏర్పాట్లు చేశారు. రామాయణ పారాయణం, యాగం, కథా ప్రవచనం కూడా నిర్వహించనున్నారు. ప్రాణ ప్రతిష్ఠ జరిగిన అనంతరం అయోధ్యలో ఇది వరుసగా రెండవ రామ నవమి.

ప్రతి సంవత్సరం రామ నవమి వేడుకలు అయోధ్యలోని అన్ని దేవాలయాల్లో, మఠాలలో వివిధ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నప్పటికీ.. ఈ సంవత్సరం రామ నవమి చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. ఇప్పటికే ఈ వేడుకల కోసం శ్రీ రామ మందిర తీర్థ క్షేత్ర ట్రస్ట్ గొప్ప, దైవిక సన్నాహాలు చేసింది. రామ నవమి సందర్భంగా బాల రామయ్యకు ఒక గంట పాటు అభిషేకం చేయనున్నారు. అనంతరం బాల రామయ్య నుదిటి మీద సూర్యతిలకం 4 నిమిషాలు పాటు ఉండనుంది. అంతేకాదు.. బాల రామయ్య పుట్టిన రోజుకి 56 రకాల నైవేద్యాలను సమర్పించడానికి ఏర్పాటు చేస్తున్నారు. 2024 సంవత్సరంలో శ్రీ రాముని ప్రాణ ప్రతిష్ఠ తర్వాత.. ఇంత గొప్ప కార్యక్రమాలు నిర్వహించడం ఇది వరుసగా రెండవ సంవత్సరం.

బాల రామయ్య విగ్రహాన్ని ప్రతిష్టించినప్పటి నుంచి రామాలయంలో భక్తుల రద్దీ నిరంతరం కొనసాగుతూనే ఉంది. రోజూ వేలాది మంది భక్తులు వస్తున్నారు. ఈ ఏడాది రామ నవమి రోజున భక్తుల సంఖ్య అనేక రెట్లు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు రామమందిర ట్రస్ట్ కూడా భక్తుల సౌకర్యార్థం అవసరమైన ఏర్పాట్లు చేయడం ప్రారంభించింది. వేసవి కాలం కనుక రోజు రోజుకీ ఎండ వేడి పెరిగిపోతోంది. దీంతో రోడ్లు, నేల వేడెక్కుతాయి. దీంతో చల్లదనం కోసం ఇప్పటికే మ్యాటింగ్ పని ప్రారంభించారు. తాగునీటి కుళాయిలు, చల్లటి నీరు, సాధారణ నీరు ప్రతిచోటా ఏర్పాటు చేయబడుతున్నాయి. మొత్తం దర్శన మార్గం వెంట దాదాపు 200 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు.

రోడ్లపై కూడా కూలర్లు ఏర్పాటు

భక్తుల రద్దీని నియంత్రించడానికి క్యూ నిర్వహణ ఏర్పాటు కూడా చేస్తున్నారు. దర్శనం ముగిసిన తర్వాత.. హారతి మొదలయ్యే సమయంలో భక్తులు ఆగే ప్రదేశాలలో… ప్రత్యేక రకాల ఫ్యాన్లను, కూలర్లను ఏర్పాటు చేస్తున్నారు, ఇవి ఎల్లప్పుడూ చల్లటి నీటిని చల్లుతూనే ఉంటాయి. రోడ్లపై వివిధ ప్రదేశాలలో కూలర్లను ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ ప్రకారం ఆలయంలో ప్రతిరోజూ వాల్మీకి రామాయణం, శ్రీరామ చరిత మానస్ పారాయణం చేయబడతాయి. యాగశాలలో రోజువారీ నైవేద్యాలు సమర్పించనున్నారు. అంగద్ తిల ప్రాంగణంలో 9 రోజుల పాటు అతుల కృష్ణ భరద్వాజ్ ద్వారా నిరంతర కథా ప్రవచనం ఇవ్వబడుతుంది. తీవ్రమైన వేడి కారణంగా పువ్వులు ఎక్కువ సమయం ఉండవు. కనుక విద్యుత్ అలంకరణల అది కూడా పరిమిత పరిమాణంలో మాత్రమే జరుగుతాయని ఆయన అన్నారు. అదేవిధంగా దీపాలు కూడా వెలిగిస్తారు.

రామ నవమి రోజున జరిగే కార్యక్రమాలు

  1. బాల రామయ్యకి అభిషేకం 9:30 గంటలకు ప్రారంభమవుతుంది.
  2. 10:30 గంటలకు గర్భ గుడి తలుపులు మూసివేయనున్నారు. ఈ సమయంలో బాల రామయ్యకు అలంకరణ చేస్తారు.
  3. 10:50 గంటలకు స్వామివారికి అభిషేకం, అలంకరణ దర్శనం జరుగుతుంది. ఇది దేశ, విదేశాలలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.
  4. 11:50 గంటలకు తలుపు మూసివేస్తారు. ప్రసాదం సమర్పణ కోసం సన్నాహాలు ప్రారంభమవుతాయి.
  5. 12:00 గంటలకు భగవంతుడు జన్మ దిన వేడుకలు మొదలవుతాయి. అదే సమయంలో సూర్యుడు తిలకం దిద్దనున్నాడు. హారతి నిర్వహిస్తారు. ఈ సమయంలో 56 రకాల నైవేద్యాలు సమర్పించనున్నారు.

Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights