రణ రంగం రివ్యూ

sar1

Teluguwonders:

యంగ్ హీరో శర్వానంద్ గ్యాంగ్ స్టర్‌గా నటించిన చిత్రం ‘రణరంగం’. సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లు. ఫస్ట్‌లుక్‌తోనే అందరి దృష్టిని ఆకర్షించిన శర్వా.. ఆ తరవాత టీజర్, ట్రైలర్లతో అంచనాలను పెంచేశారు. దీనికి తోడు ప్రచారం కూడా బాగానే కల్పించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

కాకినాడలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇటీవల ‘రణరంగం’ సౌండ్ కట్ ట్రైలర్‌ను లాంచ్ చేసిన రామ్ చరణ్ వహ్వా అన్నారు.

మొత్తానికి ఈ చిత్రం ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. 👉యూఎస్‌లో ఇప్పటికే ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యాయి.అక్కడ సినిమా చూస్తున్నవాళ్లు ట్విట్టర్ ద్వారా స్పందిస్తున్నారు. రణరంగం’ విడుదల సందర్భంగా సినీ పరిశ్రమకు చెందినవారు, శర్వానంద్ అభిమానులు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరోవైపు యూఎస్‌లో ‘రణరంగం’ ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యాయి. అక్కడ సినిమా చూస్తున్నవాళ్లు కూడా ట్వీట్లు చేస్తున్నారు.

ఇంకా ఫస్ట్ ప్రీమియర్ షో పూర్తికాలేదు. అది పూర్తయితే కానీ సినిమాకు సంబంధించి పూర్తి టాక్ బయటికి రాదు. అయితే, సినిమా జరుగుతుండగానే ప్రేక్షకులు కొన్ని ఆసక్తికర ట్వీట్లు చేస్తున్నారు.

🔴 ఆసక్తిని పెంచుతున్న రెండు అంశాలు:

 ‘రణరంగం’ సినిమా ఎలా ఉందో ఇంకా తెలియకపోయినా ఈ రెండు అంశాలు ఆసక్తిని పెంచుతున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గంభీరమైన స్వరంతో సినిమా ప్రారంభమైందట. ఈ విషయాన్ని కొంత మంది ఎన్టీఆర్ అభిమానులు ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకుంటున్నారు. వాస్తవానికి ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఇప్పటి వరకు రివీల్ చేయలేదు. ఇప్పుడు అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చింది. అలాగే సినిమాలో ‘అల్లుడా మజాకా’ రిలీజ్ డే ఉందట. చిరంజీవి కటౌట్‌ను చూపించారని.. థియేటర్‌లో గోల గోల అని మరొక ప్రేక్షకుడు ట్వీట్ చేశారు.

🔴చిరంజీవిని గుర్తుచేశారంటూ :

ఫస్టాఫ్ కాస్త స్లోగా నడిచిందని, అయితేనేం సూపర్‌గా ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కొన్ని యాంగిల్స్‌లో శర్వా.. చిరంజీవిని గుర్తుచేశారంటూ ఫ్యాన్స్ ట్వీటుతున్నారు. సెకండాఫ్‌లో స్క్రీన్ ప్లే సినిమాకు డ్రా బ్యాక్ అని టాక్ వస్తోంది. క్లైమాక్స్, ఫినిషింగ్ కూడా అంతగా ఆకట్టుకోలేదని నెటిజన్లు స్పందిస్తున్నారు.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights