ప్రముఖ నేపథ్య గాయని రావు బాల సరస్వతి కన్నుమూత

rao-bala-saraswathi

తెలుగు తొలి నేపథ్య గాయని రావు బాల సరస్వతి కన్నుమూశారు. ఆమెకు 97 సంవత్సరాలు. హైదరాబాద్‌లోని మణికొండలో తుదిశ్వాస విడిచారు. 1928 ఆగస్టు 29న జన్మించారు రావు  బాలసరస్వతి. తన ఆరో ఏటనే పాటలు పాడటం మొదలుపెట్టారు. ప్రముఖులు ఆమె మృతికి సంతాపం తెలుపుతున్నారు.

తెలుగు తొలి నేపథ్య గాయని రావు బాల సరస్వతి కన్నుమూశారు. ఆమెకు 97 సంవత్సరాలు. హైదరాబాద్‌లోని మణికొండలో తుదిశ్వాస విడిచారు. 1928 ఆగస్టు 29న జన్మించారు రావు  బాలసరస్వతి. తన ఆరో ఏటనే పాటలు పాడటం మొదలుపెట్టారు. పాతతరం తెలుగు చలనచిత్రాల నటి గా, నేపథ్యగాయనిగా ప్రసిద్ధి పొందారు . కర్ణాటిక్‌, హిందూస్తానీ సంగీతాలను నేర్చుకున్న తొలితరం నటి ఆమె. వీణ, పియానో వాయించడంలో ప్రావీణ్యం పుణికిపుచ్చుకున్నారు. ఆరేళ్ల వయసులోనే సోలోగా రికార్డులు రిలీజ్‌ చేసి అందరి మన్ననలు పొందారు సరస్వతి.

రావు బాలసరస్వతి అసలు పేరు సరస్వతి.. చిన్నతనం నుంచి పాటలు పాడటంతో ‘బాల’ అనే పదాన్ని పేరు ముందు చేర్చి బిరుదిచ్చారు. యుక్త వయసు వచ్చాక కోలంక జమీందారును పెళ్లి చేసుకున్నారు సరస్వతి. 1950 వరకు నేపథ్య గాయనిగా కొనసాగారు.. సి.పుల్లయ్య ‘సతీ అనసూయ’లో నటించారు. ఆ తర్వాత పలు సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆమె నటించిన తొలి చిత్రం విడుదలై ఎనిమిది దశాబ్దాలు అవుతోంది.

పెళ్లయిన తర్వాత చాన్నాళ్లు భర్తకు తెలియకుండా పాటలు పాడేవారు. అలా తెలుగుతో పాటు తమిళ్‌, సింహళ తదితర భాషల్లో పాటలు పాడారు. తొలి తరం గాయనీమణిగా ఆమెకు ఆ రంగంలో విశేషమైన గౌరవం ఉంది.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights