వివాదమే లేని సినిమా..తీస్తున్నా..చంద్రబాబుపై ఒట్టు అంటున్న ఆర్జీవీ

RGV is a scum on Chandrababu

Teluguwonders:

ఆంధ్రప్రదేశ్‌లో భవిష్యత్తులో ఉండబోయే పరిస్థితిపై ప్రస్తుతం రాసుకున్న కథే ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అని వర్మ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
కమ్మ, రెడ్డి అనే రెండు కులాల పేర్లు వాడేసి అస్సలు వివాదాస్పదం కాని సినిమా తీస్తున్నానని వర్మ చెబుతున్నారు. కానీ, పరిస్థితి అలా ఉంటుందా? ఆర్టీవీ దీనిపై ఒక్క ట్వీట్ చేస్తేనే దాని కింద కామెంట్లతో కమ్మలు, రెడ్లు కొట్టేసుకుంటున్నారు. బూతులు తిట్టుకుంటున్నారు. వీళ్ల మధ్యలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా దూరుతున్నారు. కొంత మంది వర్మ సూపర్ అంటే.. మరికొందరు ఛీకొడుతున్నారు. ఆర్జీవీ సినిమా ఎలా ఉన్నా ఆయనకు మాత్రం ట్విట్టర్ ద్వారా మంచి ఎంటర్‌టైన్మెంట్ దొరుకుతోంది. రెండు వర్గాల మధ్య చిన్న నిప్పు రాజేసి ఆ పక్కనే కూర్చొని చలికాచుకుంటున్నారు వర్మ. 👉ఔనురామ్ గోపాల్ వర్మ మరో బాంబ్‌ పేల్చారు. అస్సలు వివాదం లేదంటూనే వివాదాస్పద సినిమాకు సంబంధించిన ప్రకటన ఒకటి చేశారు. తన అభిమానులకు కిక్ ఇచ్చే అప్‌డేట్‌తో వచ్చారు.

అస్సలు వివాదాస్పదం కాని సినిమా అంటూ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో వివాదానికి తెరలేపారు. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే సినిమాను ఆ మధ్య ఆర్జీవీ ప్రకటించిన విషయం తెలిసిందే. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా వివాదం తరవాత ఈ ప్రాజెక్ట్‌పై అప్‌డేట్ ఏమీ రాకపోవడంతో ఇది అటకెక్కేసిందని అంతా అనుకున్నారు. కానీ, ఆర్జీవీ మాత్రం చడీచప్పుడూ లేకుండా ఈ సినిమాను పూర్తిచేస్తున్నారు. ఇప్పటికే ఒక పాట కూడా పూర్తిచేశారు. ఈ పాట ట్రైలర్‌ను రేపు (ఆగస్టు 9న) ఉదయం 9 గంటలకు విడుదల చేస్తున్నారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఆర్జీవీ ప్రకటించారు.

‘ది మోస్ట్ నాన్ కాంట్రవర్షియల్ ఫిల్మ్’ అంటూ తన సినిమా గురించి ఆర్జీవీ చెప్పుకున్నారు. ఇది నిజంగా అస్సలు వివాదాస్పదం కాని సినిమా అని అన్నారు. చంద్రబాబు నాయుడుపై ఒట్టేసి చెబుతున్నా అని పేర్కొన్నారు. తొలి పాట ట్రైలర్‌ను రేపు ఉదయం 9 గంటలకు విడుదల చేస్తున్నామని చెప్పారు.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights