Rishab Shetty: అంచనాల మధ్య కాంతార: చాప్టర్ 1.. రిషబ్ శెట్టి పారితోషికం ఎంతో తెలుసా.. ?

రిషబ్ శెట్టి పాన్ ఇండియా సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. కన్నడలో ఇదివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన ఆయన ఇప్పుడు హీరోగా మారారు. తెలుగు, తమిలం, కన్నడ, మలయాళం, హిందీ సినీప్రియులకు ఇష్టమైన హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.
ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ కాంతార: చాప్టర్ 1. కన్నడ హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి తెరకెక్కిస్తున్న ఈ మూవీ పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. గతంలో సూపర్ హిట్ అయిన కాంతార చిత్రానికి ప్రీక్వెల్ ఇది. ఇందులో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అలాగే దర్శకుడిగా, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ సైతం అందిస్తున్నారు. బాధ్యతలన్నింటినీ స్వీకరించడం ఒక పెద్ద సవాలు. ఆయన ఈ సవాలును విజయవంతంగా నిర్వహించారు. దీంతో ఇప్పుడు ఈ చిత్రానికి రిషబ్ శెట్టి ఏ స్థాయిలో పారితోషికం తీసుకుంటారు అనే చర్చ నడుస్తుంది. ప్రస్తుతం సినిమా ప్రపంచంలో సరికొత్త ట్రెండ్ నడుస్తుంది.
స్టార్ హీరోస్ అందరూ సినిమాకు పారితోషికం కాకుండా సినిమాల్లో లాభాల్లో వాట తీసుకుంటున్నారు. ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి చాలా మంది స్టార్లు సినిమా విజయం తర్వాత వచ్చే కలెక్షన్లలో వాటా తీసుకుంటున్నారు. ఇప్పుడు రిషబ్ శెట్టి సైతం అదే పనిచేయనున్నారని సమాచారం. కన్నడలో చాలా మంది ఆర్టిస్టులు తమ రెమ్యునరేషన్ ఫిక్స్ చేసుకుని తీసుకుంటారు. సినిమా హిట్ అయినా, కాకపోయినా అది నిర్మాతలపైనే పడుతుంది. ఇప్పుడు కాంతార 1 చిత్రానికి రిషబ్ శెట్టి అదే చేస్తున్నారు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
